వెక్కి వెక్కి ఏడ్చిన వేట‌గాడు.. క‌ష్ట, సుఖాల‌ను స‌మంత ముందు పెట్టిన చిరంజీవి

Samsthi 2210 - December 26, 2020 / 05:03 PM IST

వెక్కి వెక్కి ఏడ్చిన వేట‌గాడు.. క‌ష్ట, సుఖాల‌ను స‌మంత ముందు పెట్టిన చిరంజీవి

ఇండ‌స్ట్రీలో ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఎందరికో ఆద‌ర్శంగా నిలిచారు. ఆయ‌న న‌డ‌వ‌డిక‌, ప్ర‌వ‌ర్త‌న‌, విన‌యంతో ఎంతో మంది మ‌న‌సుల‌ని గెలుచుకున్నారు. కెరియ‌ర్‌లో 151 సినిమాలు చిరంజీవి ఇప్ప‌టికీ ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమాన‌గ‌ణాన్ని మ‌రింత‌గా పెంచుకుంటున్నారు. స్వ‌యంకృషితో వ‌చ్చిన చిరంజీవి త‌న మొహంపై చిరున‌వ్వుని అంద‌రి ముందు పెడ‌తాడే త‌ప్ప బాధ‌ల గురించి పెద్దగా చ‌ర్చించ‌రు. తాజాగా సామ్ జామ్ అనే టాక్‌షోకు హాజ‌రైన మెగాస్టార్ త‌న క‌ష్ట‌, సుఖాల‌ను స‌మంత ముందు ఉంచారు.

sam jam 1

 

ఆహా అనే ఓటీటీ కోసం స‌మంత హోస్ట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సామ్ జామ్ పేరుతో ప‌లువురు సెల‌బ్రిటీల‌ని ఈ టాక్ షోకు పిలిచి ఇంట‌ర్వ్యూలు చేస్తుంటుంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం చిరుని ఇంట‌ర్వ్యూ చేయ‌గా, ఈ ఎపిసోడ్‌ని డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ కానుక‌గా స్ట్రీమ్ చేశారు. ఇందులో చిరంజీవి చెప్పిన ఆస‌క్తిక‌ర అంశాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌న సినీ, రాజ‌కీయ జీవితాల‌కి సంబంధించి ప‌లు విషయాలు మాట్లాడిన మెగాస్టార్ వేట సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు దుప్పటి క‌ప్పుకొని వెక్కివెక్కి ఏడ్చిన‌ట్టు తెలియ‌జేశారు.

చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన ఖైదీ చిత్రం 1983లో విడుద‌లైంది.ఆ సినిమా చిరు కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమా సాధించిన ఉత్సాహంతో 1986లో సేమ్ కాంబినేష‌న్‌లో వేట చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క‌బోర్లా ప‌డింది. దీంతో మ‌నోడు త‌న బాధ‌ను దిగ‌మింగుకోలేక దుప్ప‌టి క‌ప్పుకొని ఏడ్చారట‌. కొన్నాళ్ళ త‌ర్వాత కాని ఆ బాధ పోలేదు అని చిరు వివ‌రించారు. ఇక త‌న సూప‌ర్ హిట్ సినిమాల‌ని ఇప్పుడు ఎవ‌రు రీమేక్ చేస్తే బాగుంటుంది అని చెప్ప‌గా, అన్నింటికి ప‌లువురు హీరోల పేర్లు చెప్పిన చిరంజీవి స్వ‌యంకృషిని మాత్రం ఎవ‌రు చేయ‌ర‌ని చెప్ప‌డం విశేషం

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us