CHIRANJEEVI: ఎన్టీఆర్ జ‌యంతి.. ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టిన చిరంజీవి

న‌టుడిగా, రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న న‌ట‌ర‌త్న‌, విశ్వ విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ‌, ప‌ద్మ శ్రీ నంద‌మూరి తార‌క‌రామారావు 98వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌నను స్మ‌రించుకుంటున్నారు. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమాన న‌టుడు ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌తో దిగిన ఓ అద్భుత‌మైన ఫొటోను పంచుకున్నారు. ఇందులో చిరంజీవి ఎంతో అనుభూతికి లోనైన‌ట్టు క‌నిపిస్తుంది. ఫొటోలో రాఘ‌వేంద్ర‌రావుని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ “ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవందక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

మీ పాదం మోపక తెలుగు ధ‌రిత్రి చిన్న‌బోతుంది, మీ రూపు కాన‌క తెలుగు గుండె త‌ల్ల‌డిల్లిపోతుంది, పెద్ద మ‌న‌సుతో ఈ గుండెని , ధరిత్రిని మ‌రొక్క‌సారి తాకిపో తాతా అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. క‌ళ్యాణ్ రామ్ , నారా రోహిత్ వంటి వారు కూడా తమ తాత‌ను స్మ‌రించుకుంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు షేర్ చేశారు.