CHIRANJEEVI: పుష్ప‌ టీజ‌ర్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌.. త‌గ్గేదే లే అంటూ కామెంట్

CHIRANJEEVI టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌లో పుష్ప చిత్రం ఒక‌టి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా నుండి స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మార‌నున్న‌ట్టు సుకుమార్ తెలిపాడు. బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ టీజర్ లో అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠామేస్త్రిగా ఎక్క‌డా త‌గ్గేదే లే అన్న‌ట్టుగా చూపించారు మేక‌ర్స్. పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ లుక్స్, ఆయ‌న స్టైల్‌, ప‌ర్‌ఫార్మెన్స్ అదిరిపోయింది.

అరిటాకులో ప‌రిచిన విందు భోజనంలా పుష్ప టీజ‌ర్ ఫ్యాన్స్‌కు మరింత ఆనందాన్ని క‌లిగించింది. మాస్ ఆడియ‌న్స్ మెచ్చేలా సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కించాడు. పుష్ప‌రాజ్ గెట‌ప్‌లో ఉన్న బ‌న్నీ ముఖానికి ముసుగు ధ‌రించి చేసిన ఫైట్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ అందించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం త‌గ్గేదే లే అనే లా ఉంది. పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ న‌ట విన్యాసం ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ టీజ‌ర్ ఆడియ‌న్స్‌నే కాదు సినీ సెల‌బ్రిటీల‌ను సైతం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి.. పుష్ప మూవీ టీజ‌ర్ చూసి బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురిపించారు. పుష్ప‌ టీజర్ చూసాను. చాలా రియలిస్టిక్ గా , ర‌స్టిక్‌గా ఉంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ త‌గ్గేదే లే. హ్యాపీ బ‌ర్త్ డే మై డియ‌ర్ బ‌న్నీ అంటూ మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. చిరు ప్ర‌శంస‌ల‌కు బ‌న్నీ ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు. రంగ‌స్థ‌లం చిత్రంతో రామ్ చ‌ర‌ణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు పుష్ప ద్వారా బ‌న్నీకు కూడా మెమోర‌బుల్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు టీజ‌ర్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.

 

 

Advertisement