ACHARYA: బ‌ర్త్‌డేకు గిఫ్ట్ పక్కా అంటున్న చిరంజీవి.. ప్రూవ్ ఎంటో తెలుసా?

ACHARYA మెగాస్టార్ చిరంజీవికి ఆరుప‌దుల వ‌య‌స్సు దాటిన కూడా ఆయ‌న‌ను అభిమానులు హీరోగా స్వీక‌రిస్తారు. చిరంజీవి స్టెప్ వేస్తే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. చిరు డైలాగ్ చెబితే బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయం. సైరా త‌ర్వాత చిరంజీవి.. కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా దేవ‌స్థానం కు సంబంధించిన నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమాను మే 13న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాని కరోనా వ‌ల‌న చిత్రం వాయిదా ప‌డుతుంద‌ని తెలుస్తుంది. దాదాపు ఆగ‌స్ట్‌లో రిలీజ్ అవుతుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న‌, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Articles on internet on Acharya Release Date
Articles on internet on Acharya Release Date

అయితే ట్రేడ్ వర్గాల ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన ఉందని కొరటాల పంపిణీ వర్గాలకు సమాచారం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అస‌లు ఆచార్య చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న చాలా రోజులు వాయిదా ప‌డింది. ఇప్పుడు సెకండ్ వేవ్‌తో అదే ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో మెగాస్టార్ సినిమాని వాయిది వేయ‌క త‌ప్ప‌డం లేదు. ఏది ఏమైన ఆచార్య చిత్రం ఆగ‌స్ట్‌కు రానుండ‌డం ప‌క్కా అంటున్నారు. వీలుంటే చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఆగ‌స్ట్ 22న సినిమాని రిలీజ్ చేసే సంకేతాలు కూడా క‌నిపిస్తున్నాయ‌.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మెజారిటీ భాగం మూసేసారు. కొన్ని తెర‌చి ఉన్నా కూడా జ‌నాలు వ‌చ్చే ప‌రిస్తితి లేదు. ఏది ఏమైన ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించాక కానీ ఏదీ కొరటాలకు క్లారిటీ రాకపోవచ్చు. ఆచార్య కోసం గత రెండేళ్లుగా కొరటాల సహా చిత్రబృందం పని చేస్తూనే ఉంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డి తో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ 20 నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ న‌టిస్తుండ‌గా, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత చిరు ఇత‌ర ప్రాజెక్ట్‌ల‌ను స్పీడ‌ప్ చేయ‌నున్నాడు.

Advertisement