Waltair Veerayya : వాల్తేరు వీరయ్య.. 2వ వంద కోట్లకు 7 రోజుల సమయం
NQ Staff - January 23, 2023 / 09:11 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా 200 కోట్ల రూపాయల మార్కుని వాల్తేరు వీరయ్య క్రాస్ చేసిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీస్ మేకర్స్ వారు ప్రకటించిన దాని ప్రకారం పది రోజుల్లో వాల్తేరు వీరయ్య సినిమా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
మొదటి 100 కోట్ల రూపాయలను మూడు రోజుల్లో కలెక్ట్ చేయగా రెండవ వంద కోట్ల రూపాయలను వసూలు చేసేందుకు ఏడు రోజుల సమయం పట్టింది. మరో 100 కోట్ల రూపాయలను ఈ సినిమా రాబడుతుందా అంటూ మెగా ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే రెండు వారాలు కాబోతుంది, సినిమా యొక్క సందడి కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇంకా మహా అయితే పాతిక నుండి 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను ఈ సినిమా రాబట్టే అవకాశం ఉందని, వచ్చేవారం రాబోతున్న సినిమాలు ఆకట్టుకోక పోతే రూ. 250 కోట్ల మార్కు ఈ సినిమా క్రాస్ చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.