Waltair Veerayya : ‘బాస్ పార్టీ’ అంతలా కాపీ కొట్టేశావా బాసూ.!

NQ Staff - November 24, 2022 / 06:52 AM IST

Waltair Veerayya : ‘బాస్ పార్టీ’ అంతలా కాపీ కొట్టేశావా బాసూ.!

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవికి ఏమయ్యింది.? ఎందుకు ఇంతలా కాపీ కొట్టేసినట్టు.? ఇలా సోషల్ మీడియాలో ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే, ఇదంతా పాజిటివ్ యాంగిల్‌లోనే జరుగుతున్న చర్చ.

‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని మాత్రమే రివీల్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ లిరికల్ సాంగ్ వింటోంటే, గతంలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన చాలా పాటలు గుర్తుకొస్తున్నాయి.

విజువల్స్‌లో ఆ డాన్స్ మూమెంట్స్…

చాన్నాళ్ళ క్రితం ‘ఘరానా మొగుడు’ సినిమా కోసం బీభత్సమైన డాన్సులేశారు చిరంజీవి. అందులోని ‘బంగారు కోడిపెట్ట’ పాటకు సంబంధించి ఓ బిట్‌‌లో చిరంజీవి చేసిన డాన్స్‌ని పోలివుండేలా స్టెప్స్ దించేశారు ‘బాస్ పార్టీ’ కోసం.

ఇక్కడ చిరంజీవిని తప్పు పట్టడానికేమీ లేదు. అప్పటికీ.. ఇప్పటికీ చిరంజీవిలో డాన్సుల పరంగా గ్రేస్ తగ్గలేదు. అన్నట్టు, ‘ముఠామేస్త్రి’లోని హుక్ స్టెప్ కూడా, ‘బాస్ పార్టీ’లోని హుక్ స్టెప్‌ని పోలి వుంది.
వామ్మో, ఒకటా.? రెండా.. చాలా పోలికలు.. జస్ట్ లిరికల్ సాంగ్‌తోనే బయటకు వస్తున్నాయ్. ప్చ్.. శేఖర్ మాస్టార్ కాస్తా కాపీ మాస్టార్ అయిపోయాడన్నమాట.! డాన్సు మాస్టారూ.. ఇలా చేశారేంటీ.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us