Marriage: చిరంజీవి భార్య‌కు మ‌ళ్లీ పెళ్లి.. ఆశ్చ‌ర్య‌పోతున్నఅభిమానులు

Marriage: చిరంజీవి అన‌గానే మ‌న‌కు మెగాస్టార్ చిరంజీవి ఠ‌క్కున గుర్తుకొస్తారు. కాని ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా గురించి. కన్న‌డ ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి స‌ర్జా కొన్నేళ్ల క్రితం క్రిస్టియ‌న్ మ్యారేజ్ ప‌ద్ద‌తిలో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెళ్లిగా మార‌డంతో వివాహం చేసుకున్నారు. దాదాపు పది సంవత్సరాలు డేటింగ్ చేసిన చిరు, మేఘనా రాజ్, 2018లో వివాహం చేసుకున్నారు.

Chiranjeevi Sarja Wife Ready to Second Marriage
Chiranjeevi Sarja Wife Ready to Second Marriage

నటి మేఘన రాజ్‌ కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో ఒకరు. ‘కాదల్ సొల్లా వందేన్’, ‘నంద నందిత’ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. గ‌త ఏడాది చిరంజీవి స‌ర్జా గుండెపోటుతో క‌న్నుమూయ‌గా, ఆయ‌న పుట్టిన కొద్ది రోజుల‌కి మేఘ‌నా పండంటి కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది.

హీరో అర్జున్ కి చిరంజీవి సర్జా స్వయానా మేనల్లుడు కాగా, ఆయ‌న మృతిపై అర్జున్ కూడా చాలా ఆవేద‌న చెందారు. అయితే చిరు మరణించిన ఏడాది తర్వాత మేఘన, కన్నడ ‘బిగ్‌బాస్‌ 4’ విన్నర్‌ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.

Chiranjeevi Sarja Wife Ready to Second Marriage
Chiranjeevi Sarja Wife Ready to Second Marriage

ప్రథమ్ యూట్యూబ్‌లోని సదరు వీడియోని షేర్‌ చేశాడు. ‘వ్యూస్‌, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు. కానీ ఒక్కరోజులో దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు’ అని మండిపడ్డారు.

మేఘనా రాజ్‌ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స‍్పందించలేదు.భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత మేఘ‌న చాలా కుంగిపోయింది. ఇప్ప‌టికీ ఆమె ఆ బాధ నుండి తేరుకోలేక‌పోయింది. చిరంజీవిని త‌ల‌చుకుంటూ బాధ‌ప‌డుతుంది.