Chiranjeevi : కింగు.. కింగు మేకరు.. మెగాస్టారు.! ఈ రాజకీయం ఏంటి గాడ్ ఫాదరూ.!

NQ Staff - October 4, 2022 / 06:56 PM IST

Chiranjeevi : కింగు.. కింగు మేకరు.. మెగాస్టారు.! ఈ రాజకీయం ఏంటి గాడ్ ఫాదరూ.!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రాజకీయం మొదలు పెట్టారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆ రాజకీయానికి సరికొత్త వేదికగా మారినట్లుంది. కొన్నాళ్ళ క్రితం ‘రాజకీయాన్ని నేను వదిలేసినా, నన్ను రాజకీయం వదల్లేదు..’ అని చిరంజీవి ట్వీటేసిన సంగతి తెలిసిందే.. అదీ ఆడియో రూపంలో.

‘గాడ్ ఫాదర్’లోని ఈ డైలాగుని చిరంజీవి ఆడియో రూపంలో విడుదల చేయడంతో అది పెను సంచలన మయ్యింది. ‘నేను సినిమా డైలాగ్ పేల్చితే, దాన్ని రాజకీయానికి ఆపాదించారు..’ అంటూ చిరంజీవి ఆ తర్వాత సెటైరేశారనుకోండి.. అది వేరే సంగతి.

దీన్ని మెగా సినీ రాజకీయం అనుకోవచ్చా..

తాజాగా ‘కింగునైనా, కింగ్ మేకర్‌ని అయినా క్రికేట్ చేసేది బ్రహ్మ..’ అంటూ ఇంకో ఆడియో విడుదల చేశారు చిరంజీవి. ఇది కూడా ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని డైలాగే. ‘గాడ్ ఫాదర్’ ఓ పొలిటికల్ థ్రిలర్. ఈ నేపథ్యంలో అందులో చాలా పొలిటికల్ డైలాగులు వుంటాయని ఆశించొచ్చు.

మలయాళంలో అంతగా స్కోప్ లేకపోయినా, తెలుగులో బాగా రాజకీయాన్ని వాడేసినట్లే కనిపిస్తోంది. ఇది, జనసేన పార్టీకి కలిసొచ్చేలా చిరంజీవి చేసిన మెగా సినిమా ప్లాన్ అనుకోవచ్చా.? అంటే, ‘అలాగని ఎవరైనా భుజాలు తడుముకుంటే నాకు సంబంధం లేదు..’ అని చిరంజీవి తాజాగా సెలవిచ్చారు.
ఇంతకీ, కింగు.. కింగ్ మేకర్.. వీళ్ళని తయారు చేసేంత సీన్ మెగాస్టార్ చిరంజీవికి వుందా రాజకీయాల్లో.?

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us