Chiranjeevi: ప్ర‌కృతి ప్ర‌కోపం.. తిరుప‌తి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుద్దామంటున్న చిరంజీవి

Chiranjeevi: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేని వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది..

chiranjeevi reacts on tirupathi floods1
chiranjeevi reacts on tirupathi floods1

క్యూ లైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలోని జలపాతాలు మత్తడి దూకుతున్నాయి. రోడ్లు, అండర్‌వే బ్రిడ్జీలు జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా.. కొన్ని చోట్ల వరద ధాటికి తట్టుకోలేక పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. ఒకచోట స్వర్ణముఖి నదిలో ఇల్లు కొట్టుకుపోయింది. పలు చోట్ల రోడ్ల మీద, ఇళ్లలో చేరిన వరద నీటిలో జనాలు ఈత కొట్టారు. తిరుపతి వరదలకు సంభందించిన వీడియోలు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.

గార్గేయి నది ఉగ్ర రూపం దాల్చడంతో.. చిత్తూరు జిల్లా సదుం సమీపంలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.అక్క‌డి ప‌రిస్థితులు చూసి ప్ర‌తి ఒక్క‌రు చ‌లించిపోతున్నారు. తాజాగా చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందరం క‌లిసి ప‌ని చేద్దామ‌ని అన్నారు.

chiranjeevi reacts on tirupathi floods2
chiranjeevi reacts on tirupathi floods2

గ‌తంలో ఎన్న‌డు లేనంత‌గా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మ‌న‌సుల‌ని క‌లిచివేస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం, టీటీడీలు క‌లిసిక‌ట్టుగా కృషి చేసి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సాధార‌ణ ప‌రిస్థితుల‌ని నెల‌కొల్పాలి. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత‌నివ్వాల్సిందిగా కోరుతున్నాను అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.