Chiranjeevi: జ‌గ‌న్‌కి శాలువా కప్పి పుష్ప‌గుచ్చం అందించిన చిరంజీవి..భేటిలో ఏఏ విష‌యాలు చ‌ర్చ‌కు రానున్నాయి?

Chiranjeevi: గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వానికి- సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న క్ర‌మంలోఈ రోజు చిరంజీవి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్స్ త‌గ్గించ‌డంపై వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. వైసీపీ నాయ‌కులు స్పందించ‌డం.. దానికి త‌గ్గ‌ట్లే సినీ ప్ర‌ముఖులు స్పందించ‌డం జ‌రుగుతుంది. ఈ ఇష్యూ మ‌రింత ముదురుతుంది అనుకున్న స‌మ‌యంలో చిరు.. జ‌గ‌న్‌ని క‌లిసారు.

chiranjeevi reached ys jagan house
chiranjeevi reached ys jagan house

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క‌లిసేందుకు మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్ర‌యం వ‌ద్ద‌ ఆయ‌నను మీడియా పలకరించగా.. తాను సీఎం జ‌గ‌న్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాన‌ని చెప్పారు. సీఎంతో అన్ని విషయాలపై చర్చిస్తాన‌ని చిరంజీవి తెలిపారు.

జ‌గ‌న్ తో లంచ్ చేసి, అనంత‌రం చ‌ర్చించి మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తాన‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం ఆయ‌న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జ‌గ‌న్ నివాసం వద్దకు వెళ్లి జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల అంశంపై చ‌ర్చించ‌డానికే జ‌గ‌న్‌తో చిరంజీవి స‌మావేశం అవుతున్న‌ట్లు తెలిసింది.

అయితే జ‌గ‌న్ ఇంటికి చేరుకున్న చిరంజీవి ఆయ‌న‌కు శాలువా క‌ప్పి పుష్ప గుచ్చం అందించారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. లంచ్ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ భేటి త‌ర్వాత అన్ని స‌మ‌స్య‌లపై ఓ క్లారిటీ రానుంద‌ని భావిస్తున్నారు.

chiranjeevi reached ys jagan house1
chiranjeevi reached ys jagan house1

రాష్ట్రంలో ప‌రిష్క‌రించుకోవాల్సిన స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నాయి. వాటిని వ‌దిలేసి ఎందుకు సినిమా టికెట్స్ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం దూకుడు వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఇన్ని రోజులు సినీ ప్ర‌ముఖులు, నిర్మాత‌లు కొంద‌రు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లిసి సినిమా టికెట్స్ వ్య‌వ‌హారంలో త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే మ‌ధ్య‌లో ఈ ప్ర‌య‌త్నాల‌కు బ్రేకులు ప‌డ్డాయి. ఇప్పుడు చిరంజీవికి పిలుపు రావ‌డంతో ఈ భేటిపై అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.