Godfather Movie : బిగ్‌బాస్ దివి విషయంలోనూ మాట నిలబెట్టుకున్నారు.! మెగాస్టార్ మామూలోడు కాదుగా.!

NQ Staff - October 4, 2022 / 01:39 PM IST

Godfather Movie : బిగ్‌బాస్ దివి విషయంలోనూ మాట నిలబెట్టుకున్నారు.! మెగాస్టార్ మామూలోడు కాదుగా.!

Godfather Movie : మెగాస్టార్ మాటిస్తే, జరిగి తీరాల్సిందే. అందుకోసం పెద్దగా వెయిట్ చేయాల్సిన పని కూడా వుండదు. ఆ విషయంలో ఆయన గొప్పతనాన్ని ఎంతలా ప్రశంసించినా తక్కువే. లైట్ బోయ్ దగ్గర్నుంచీ, ఏ చిన్న టెక్నీషియన్‌నీ అస్సలు లైట్ తీసుకోరు ఆయన.

అందుకే ఆయన మెగాస్టార్ అంతే.! చాలా మంది విషయంలో మెగాస్టార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా మరోసారి ఆయన ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడెప్పుడో బిగ్‌బాస్ షోకి గెస్ట్‌గా వెళ్లిన మెగాస్టార్, అందాల భామ దివికి తన సినిమాలో ఛాన్సిస్తానని మాటిచ్చారు.

బిగ్‌బాస్ బ్యూటీ దివి ‘బిగ్’ స్ర్కీన్ కోరిక..

ఆ మాట ‘గాడ్ ఫాదర్’తో నిలబెట్టేసుకున్నారు. దివికి ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ప్రిఫర్ చేశారట గాడ్ ఫాదర్. ఆ విషయం తాజాగా దివి చెబితేనే తెలిసింది. ఊటీలో షూట్ చేసే సన్నివేశంలో దివి కనిపించబోతోందట. చిన్న సీనే అయినా ఆయన దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చేయించారట ఆ సీన్.
మెగాస్టార్ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడే సీన్ అట అది. ఆ క్షణం తన జీవతానికి అది చాలు.. అనుకుందట.

ఇంకా ఇప్పుడిప్పుడే పెద్ద తెరపై అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్న దివికి ఆదిలోనే మెగాస్టార్‌తో నటించే ఛాన్స్ రావడం చాలా చాలా సంతోషంగా వుందని తెగ సంబరపడిపోతోంది దివి.
అక్టోబర్ 5 విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘గాడ్ ఫాదర్’.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us