Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ‘ఆడియో ట్వీటు’ వెనుక అంత వ్యూహం వుందా.?
NQ Staff - September 20, 2022 / 05:37 PM IST

Chiranjeevi : ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.! తరచూ వింటుంటాం ఈ మాటని. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే ట్వీటుతో, రెండు ప్రయోజనాల్ని ఆశించినట్టున్నారు.. ఆ రెండు ప్రయోజనాలూ దక్కినట్టున్నాయి కూడా.!
‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలవుతుందా.? లేదా.? అన్న సస్పెన్స్ వుందంటూ సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు హల్ చల్ చేశాయి. సినిమా రంగంలోనూ, రాజకీయాల్లోనూ నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
అక్టోబర్ 5న సినిమా విడుదల.. అంటూ అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించినా, ‘సినిమా రిలీజ్ కావడంలేదు, నేరుగా ఓటీటీకి ఇచ్చేశారు..’ అన్న గాసిప్స్ బయటకు వచ్చాయ్.
రంగంలోకి దిగిన చిరంజీవి..

Chiranjeevi Posted Audio tweet On social Media
150 సినిమాలు చేసిన అనుభవం.. పైగా, రాజకీయాల్లోనూ కాస్తో కూస్తో అనుభవం బాగానే సంపాదించారు. పైగా ‘టైమింగ్’కి కేరాఫ్ అడ్రస్ ఆయన. అందుకే, చిరంజీవి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ‘ఆడియో ట్వీట్’ వేశారు. అదీ, రాజకీయాలకు సంబంధించి.
‘గాడ్ ఫాదర్’ సినిమాలోని పొలిటికల్ డైలాగ్ అయినా, రియల్ లైఫ్ రాజకీయాలకు సంబంధించినదిగా అంతా భావించారు. ‘రాజకీయాల్ని నేనొదిలేసినా, రాజకీయాలు నన్ను వదల్లేదు..’ అన్నది ఆ ఆడియో ట్వీటు సారాంశం.
రాజకీయాల్లోనూ ఇప్పుడు చిరంజీవి పేరు మార్మోగిపోతోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమాకీ రావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది.
ఇక, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాభిమానులు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైపోవాల్సిందే.! ఇదీ ఒక్క ఆడియో ట్వీటుకి.. రెండు పబ్లిసిటీ పిట్టలు.. కథ తాలూకు సారాంశం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022