Chiranjeevi : చిరంజీవి ఇంట ఘనంగా వినాయక చవితి సంబరాలు.!
NQ Staff - August 31, 2022 / 07:21 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట వినాయక చవితి సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం ఆ ఫోటోలు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తల్లి అంజనా దేవితో కలిసి చిరంజీవి సతీ సమేతంగా పూజ చేస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi Performed Grand Pooja Ganapati
మెగాస్టార్ ఇంట కొలువు దీరిన మట్టి గణనాధుడు..

Chiranjeevi Performed Grand Pooja Ganapati
సాంప్రదాయ దుస్తులు ధరించి చిరంజీవి గణనాధునికి ఘనంగా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ చిరంజీవి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లోనూ విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాను..’ అంటూ ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

Chiranjeevi Performed Grand Pooja Ganapati
వినాయకుడికి ఇష్టమైన అన్ని రకాల పిండి వంటలతో పళ్లూ, పూలు, పత్రి నైవేద్యంగా పెట్టి, మట్టి గణనాధుడికి చిరంజీవి ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజించారు.

Chiranjeevi Performed Grand Pooja Ganapati
చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమాతో పాటూ, ‘భోళా శంకర్’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘గాడ్ ఫాదర్’ టీజర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను!
Happy #GaneshChaturthi to All! pic.twitter.com/v8cRmHvUiu
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2022