chiranjeevi:కర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్..సంతోషం వ్య‌క్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఆక్సిజ‌న్ దొర‌క్క‌, స‌రైన వైద్యం అంద‌క రోజుకు వేల మంది మ‌ర‌ణిస్తున్నారు. వారి బాధ‌ల‌ను చూసి చ‌లించిన చిరంజీవి, సోనూసూద్, సుకుమార్ వంటి సెల‌బ్స్ ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపిన మెగాస్టార్ మొత్తానికి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించాడు.

Chiranjeevi

కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఈ రోజు ప్రారంభమయ్యింది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి శ్రీ మహేష్( చింతామణి)కి స్వయంగా అభినందనలు తెలిపారు. కరోనావిపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ బ్యాంక్ ఆలోచన వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలుస్తున్నాయి.