Chiranjeevi-NTR: చిరంజీవితో జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌కి విభేదాలా.. నిర్మాత ఏమ‌న్నాడంటే…!

Chiranjeevi-NTR: సాధార‌ణంగా చిరంజీవి వివాదాల జోలికి పెద్ద‌గా వెళ్ల‌రు. త‌న‌పై ఎవ‌రెన్ని విమ‌ర్శలు చేసిన చాలా స్త‌బ్ధంగా ఉంటారు.అలాంటి చిరంజీవితో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవితో దూరం ఏర్ప‌డింది. ఒకానొక సంద‌ర్భంలో లైవ్‌లో మాట్లాడుతూ చిరంజీవి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు, ఆయ‌నెవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ చెప్ప‌డం.. అప్ప‌ట్లో హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

Chiranjeevi-NTR Difference Is Right
Chiranjeevi-NTR Difference Is Right

రాను రాను ప‌రిస్థితులు మార‌డం, చిరంజీవి మ‌న‌స్త‌త్వం ఎన్టీఆర్ తెలుసుకోవ‌డంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు ఎన్టీఆర్. చిరు త‌న‌యుడు రామ్ చ‌రణ్‌తో ఉన్న స్నేహా బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్ద‌రు క‌లిసి తొలిసారి ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

అయితే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే తార‌క్‌కి ఎందుకు ప‌డ‌లేదు? అనే ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం ఎవ‌రూ చెప్పేవారు. కాదు.. బాక్సాఫీస్ వ‌సూళ్లు, ఇమేజ్ వ‌ల్ల వ‌చ్చిన ఇగో క్లాషెష్ అని మాత్రం చెప్పేవారు. అది ఓ ర‌కంగా నిజ‌మే! అయినా ఓ స్టార్ గురించి, అందులోనూ అప్ప‌ట్లో నెంబ‌ర్ వ‌న్ హీరో గురించి అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చిన తార‌క్ త‌న‌కు తెలియ‌ద‌న‌డం .. చాలా మంది మెగా ఫ్యాన్స్‌కు ఇబ్బంది క‌లిగించిన విష‌య‌మే.

అయితే అదంతా గ‌తం ఇప్పుడు రెండు ఫ్యామిలీల మ‌ధ్య స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి. అయితే అస‌లు మెగా – నంద‌మూరి పాత గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మేంటి? అనే దానిపై సీనియ‌ర్ నిర్మాత డిస్ట్రిబ్యూట‌ర్ అయిన అవుల గిరి ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఓ మేనేజ‌ర్ ఉండేవాడ‌ట‌. ఆ మేనేజ‌ర్ చిరంజీవి గురించి ఎన్టీఆర్ లేనిపోనివి చెప్పేవాడ‌ట‌. చిరంజీవిని ఎన్టీఆర్ ద‌గ్గ‌ర చెడు చిత్రీక‌రించేవాడ‌ట‌.

Chiranjeevi-NTR Difference Is Right
Chiranjeevi-NTR Difference Is Right

దాంతో ఎన్టీఆర్‌కు తెలియ‌కుండానే చిరుపై తెలియ‌ని కోపం క్రియేట్ అయిపోయిదంట‌. కానీ.. కొన్ని రోజుల‌కు స‌ద‌రు మేనేజ‌ర్ గురించి అసలు నిజం తెలియ‌డంతో ఎన్టీఆర్ ఆయ‌న్ని మేనేజ‌ర్‌గా తొలగించార‌ని, త‌ర్వాత చిరు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎన్టీఆర్‌కు స‌ఖ్య‌త పెరిగింద‌ని గిరి చెప్పుకొచ్చారు. అద‌న్న‌మాట అస‌లు సంగ‌తి.