chiranjeevi : చిరంజీవి 153 ప్రీ ప్రొడక్షన్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసీఫర్ తెలుగు రీమేక్ చిరంజీవి 153 గా తెరకెక్కబోతోంది. తని ఒరువన్ సినిమా తో సంచలన విజయం అందుకున్న మోహన్ రాజా చిరంజీవి 153 కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్.. సూపర్ గుడ్ ఫిలిమ్స్.. ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై రాం చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

ఇక ఈ సినిమాని మేకర్స్ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి 153 కి ప్రస్తుతం నటీ, నటుల ఎంపిక జరుగుతోందట. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార చిరంజీవి 153 లో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. నయనతార ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ప్రస్తుతం నయనతార చేతిలో ఉనాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ చేసిన నయనతార మరోసారి అన్నాత్తే సినిమాలో నటిస్తోంది.
chiranjeevi : రెండవసారి చిరంజీవి కి జంటగా నటించబోతున్న నయనతార ..?
అలాగే మెగాస్టార్ చిరంజీవి తో సైరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి చిరంజీవి 153 కోసం నయనతార ని ఎంపిక చేశారట. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం. మంచి సక్సస్ లలో ఉన్న నయనతార మరోసారి చిరంజీవి తో నటించే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు. కాగా చిరంజీవి 153 విజయదశమి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. ఇక నయనతార కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా లో కూడా నటిస్తోంది. సమంత అక్కినేని .. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.