Chiranjeevi : చిరంజీవి.. రాజీనా‘‘మా’’?..

Chiranjeevi : టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లోని క్రమశిక్షణా సంఘం నుంచి మెగాస్టార్ చిరంజీవి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ కార్యక్రమాల్లో, ‘మా’ మంచీ చెడుల్లో ఇన్నాళ్లూ క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి పక్కకు జరగటం తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి రాజీనామాని ఎవరూ అఫిషియల్ గా కన్ఫాం చేయకపోయినా విషయమైతే బయటికి పొక్కింది. ‘మా’ మెంబర్స్ లో కోఆర్డినేషన్ లేకపోవటం వల్లే మెగాస్టార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలు కూడా చిరంజీవి మనసును తీవ్రంగా నొప్పించాయని, అందుకే ఆయన ఈ వివాదం మరింత ముదరకముందే గుడ్ బై చెప్పటం బెటర్ అని భావించి ఉండొచ్చంటున్నారు.

Chiranjeevi : mega star chiranjeevi resigned to maa discipline committee
Chiranjeevi : mega star chiranjeevi resigned to maa discipline committee

విశేషమే. కానీ..

రెండేళ్ల కిందట జరిగిన ‘మా’ ఎన్నికల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్-సీనియర్ నటుడు నరేష్ ప్యానల్ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందింది. ఆయనకి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు తదితర పరిశ్రమలోని పెద్ద తలకాయల మద్దతు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతోపాటు రెండు సార్లు ప్రెసిడెంట్ గా పనిచేయటం వల్ల మరో నటుడు శివాజీరాజా ప్యానల్ పట్ల సహజంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మా’ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 2019లో అత్యధికంగా 472 మంది పోలింగ్ లో పాల్గొనటం విశేషం. ఈ ఎలక్షన్స్ లో మా అధ్యక్షుడు శివాజీ రాజాని నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ని హీరో రాజశేఖర్ ఓడించారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ వైఎస్ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు. హీరో రాజశేఖర్ సతీమణి జీవిత ‘మా’ ప్రధాన కార్యదర్శి, కమెడియన్-కమ్-విలన్ రఘుబాబును పరాజయం పాల్జేశారు.

ఒకరి తర్వాత ఒకరు: Chiranjeevi

‘మా’ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మొదట్లోనే తన పదవికి రాజీనామా చేశారు. నరేష్ అధ్యక్షుడిగా ప్యానల్ ఏర్పాటైన కొన్నాళ్లు బాగానే పనిచేసింది. కానీ ఏడాది తిరక్కముందే ప్రెసిడెంట్ నరేష్ కి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి 2020 జనవరి 2న జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణలో బట్టబయలయ్యాయి. హీరో రాజశేఖర్ బహిరంగంగానే ‘మా’లోని తప్పులను పట్టిచూపారు. దీంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధలతో క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ సంఘం చర్యలు తీసుకోకముందే రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. జీవిత మాత్రం కార్యదర్శిగా కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు కరోనా వల్ల ఎలాంటి కార్యక్రమాలూ జరగలేదు. మధ్యలో చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) పేరిట ఒక ఫండ్ ని ఏర్పాటుచేసి దానికి వచ్చిన విరాళాలతో సినీ కార్మికులను ఆదుకున్నారు. మొత్తమ్మీద అధ్యక్షుడు నరేష్ రెండేళ్ల ప్యానెల్ పదవీ కాలం ముగిసింది. త్వరలో మళ్లీ ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆ క్రమశిక్షణా సంఘం నుంచి తప్పుకోవటం గమనార్హం.

Advertisement