Chiranjeevi: జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా వ‌చ్చాను: చిరంజీవి

Chiranjeevi: గ‌త కొద్ది రోజులుగా ఏపీలో ప‌రిస్థితులు ఎంత దారుణంగా మారాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం అన్న చందాన మారింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో టికెట్ ధరలు సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించిన విషయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌.. నాని క‌లిసి ప‌లు విష‌యాల గురించి చ‌ర్చించారు.

chiranjeevi meets ys jagan
chiranjeevi meets ys jagan

వ‌ర్మ భేటి త‌ర్వాత ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని అంద‌రు భావించారు. కాని అలాంటిదేమి జ‌ర‌గ‌లేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలు సహా చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేదుకు అమ‌రావ‌తి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవి – సీఎం జగన్‌ల మధ్య చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీతో దాదాపు టికెట్ లెక్కలు తేలిపోతాయని టాలీవుడ్‌లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గురువారం బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి… తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘సినిమా అంశాలపై సీఎంతో చర్చించేందుకు విజయవాడ వచ్చా. సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా. సీఎంతో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతాను’అని సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

chiranjeevi meets ys jagan
chiranjeevi meets ys jagan

సీఎం జగన్‌ ముందు చిరంజీవి ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఈ భేటిలో ఇద్దరి మ‌ధ్య ఏయే విష‌యాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది, అన్ని అంశాల‌కు సంబంధించి క్లారిటీ వ‌స్తుందా లేదా అనే దానిపై అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.