Chiranjeevi : బాస్ సినిమాకే బజ్ కరువు. మెల్లిగా డల్లవుతున్న మెగాస్టార్‌ గ్రాఫ్?

NQ Staff - October 3, 2022 / 02:12 PM IST

Chiranjeevi : బాస్ సినిమాకే బజ్ కరువు. మెల్లిగా డల్లవుతున్న మెగాస్టార్‌ గ్రాఫ్?

Chiranjeevi : మెగాస్టార్‌ సినిమా అంటే ఆకాశాన్ని తాకే హైప్, బాక్సులు బద్దలయ్యేంత బజ్‌, టికెట్ల కోసం కొట్టుకు చచ్చేంత క్రేజ్‌.. ఇప్పుడు కాదులెండి, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది పాపం. బాస్ గా బాక్సాఫీస్‌ ని రఫ్ఫాడించిన చిరు మార్కెట్ రీసెంట్ గా చాలా స్లో అయింది. సల్మాన్ ని సినిమాలో పెట్టుకుంటే అలా అయినా బిజినెస్ బాగుంటుందని ఆశపడ్డా ఆ ప్లాన్ కూడా పెద్దగా వర్కవుటవ్వటం లేదు. ‘గాడ్ ఫాదర్’ కి యూఎస్ లో పెద్దగా బజ్‌ అనేదే లేదట.

బాస్ సినిమా అంటే థియేటర్ల దగ్గర మాస్ జాతరే,

ఆడిటోరియంలో పూనకాలే అనే విషయంలో కొంతకాలం క్రితం వరకూ నో డౌట్. కానీ రీ ఎంట్రీ తర్వాత ఆయన సెలక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్‌, ప్రిఫర్ చేస్తున్న క్యారెక్టర్స్‌ చూశాక ఆడియెన్స్‌ కి ఇంట్రస్ట్ తగ్గిందనే చెప్పాలి.

ఓటీటీల్లో ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు చూసేసిన సినిమాల్ని రీమేకుల పేరుతో తెరకెక్కించి మళ్లీ థియేటర్లలో వదిలితే ఫ్యాన్స్‌ కయినా, కామన్‌ ఆడియెన్‌ కయినా ఫ్రెష్ థ్రిల్ ఎందుకొస్తుంది? షాట్‌ టు షాట్, ఫ్రేమ్‌ టు ఫ్రేమ్ ఎక్స్‌ పీరియన్స్‌ చేసే ఉంటారు కాబట్టి, కొత్తగా ఆవేశంతో థియేటర్‌ కెళ్లి టికెట్‌ కొనాలని ఎలా అనుకుంటాడు? పైగా ఈ రీమేకుల పుణ్యమా అని ఒరిజినల్ సినిమాలో ఆ హీరో లుక్‌ అలా ఉంది, ఆయనలా చేశాడు, చిరు ఏంటి ఇలా మార్చేశాడు, ఆ స్టార్‌ లా చేయట్లేదంటూ కంపారిజన్స్‌ పెరిగి ట్రోల్స్‌ వస్తున్నాయి తప్ప, స్టార్ డమ్‌ పెరిగేందుకు హెల్ప్‌ చేయట్లేదు.

దసరా బరిలో నిలవనున్న గాడ్ ఫాదర్ అనే కాదు, మెహర్ రమేష్‌ డైరెక్షన్లో చేస్తోన్న భోళా శంకర్ కూడా రీమేకే. ఖైదీ నెంబర్ 150 అంటే కొంతవరకు వర్కవుటయ్యి, రీఎంట్రీ మ్యాజిక్‌ తో ఆడింది గానీ.. ఇలా పగబట్టినట్టు, తెలుగు ఇండస్ట్రీలో కథలే లేనట్టు వరుస రీమేకులతో జనాల ముందుకు రావడం దేనికో మరి? పోనీ స్ట్రెయిట్ మూవీ చేసినా అదయినా ఆకట్టుకునే కథ, కథనంతో వచ్చిందా అంటే అదీ లేదు. ఆడియెన్స్‌ భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమానే అందుకు ఉదాహరణ. భారీ సెట్టింగులు, కోట్ల బడ్జెట్ తో తీసినా హార్డ్ కోర్ అభిమానులకు కూడా ఏ మాత్రం నచ్చక డిజాస్టర్ పాలైంది.

మరోవైపు మెహర్ రమేష్ లాంటి సక్సెస్ లేని డైరెక్టర్స్‌ తో రీమేకులనే సరికి ఫ్యాన్స్‌ కూడా నిరాశలోనే ఉన్నారు. అన్నయ్య సినిమాని ఏం చేస్తాడో? ఎలా తీస్తాడో అని అనౌన్సయిన నాటినుంచే టెన్షన్ పడుతున్నారు. బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య అంటూ మరో స్ట్రెయిట్ సినిమా చేస్తున్న ఓ ట్రైలరో, టీజరో వచ్చాక కానీ ఆడియెన్స్‌ కు హైప్ క్రియేటయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో రీమేక్‌ పేరుతో గాడ్ ఫాదర్‌ లో గనక చిత్రవిచిత్రాలు చూయిస్తే ఈ మూవీ కూడా డౌటే.

మారుతున్న ఆడియెన్స్‌ టేస్టుకి తగ్గట్టుగా ఈ రీమేకుల మీద కాకుండా.. స్టోరీ మీద, డైరెక్టర్ల మీద, స్ట్రెయిట్ చిత్రాల మీద ఫోకస్‌ చేస్తే ఆయన క్రేజ్‌ కి బాక్సాఫీస్‌ దగ్గర రికార్డుల మోతే. వసూళ్ల ఊచకోతే. మరి మెగాస్టార్ ఈ విషయాన్ని ఎంత తొందరగా రియలైజయ్యి, అటువైపుగా ఫోకస్ చేసి అభిమానుల ఆకలి తీరుస్తాడో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us