Chiranjeevi : నాకు ‘లూసిఫర్’ సినిమా నచ్చలేదుగానీ.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్.!

NQ Staff - October 4, 2022 / 04:27 PM IST

Chiranjeevi  : నాకు ‘లూసిఫర్’ సినిమా నచ్చలేదుగానీ.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్.!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ తెలుగు రీమేక్. మలయాళంలో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు, ఆయన ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశాడు కూడా.

అక్టోబర్ 5న.. అంటే, రేపే ‘గాడ్ ఫాదర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేసింది ‘గాడ్ ఫాదర్’ టీమ్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘లూసిఫర్’లో లోపాలు కనిపించాయి..

తెలుగు వెర్షన్‌ ‘లూసిఫర్’ సినిమాని కూడా తాను చూశాననీ, సినిమా సగంలో ఆగిపోయినట్లనిపించిందనీ, ఈ క్రమంలో దర్శకుడు రాజా చేసిన మార్పులతో సినిమాకి పరిపూర్ణత వచ్చినట్లనిపించిందని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి ‘లూసిఫర్’ మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా. అందుకే, దాన్ని తెలుగులోకి ‘రీమేక్’ చేస్తున్నారు. అలాంటి సినిమాలో చిరంజీవి లోపాల్ని గుర్తించడ మేంటి.? అంటూ, సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవేళ ‘గాడ్ ఫాదర్’ గనుక తేడా కొడితే, చిరంజీవి కామెంట్స్ మీద రాబోయే విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

‘భీమ్లానాయక్’ కూడా రీమేక్. అయితే, ఒరిజినల్‌తో పోల్చినప్పుడు ‘భీమ్లానాయక్’లో మంచి మార్పులు జరిగాయి. అలాంటి మార్పులు ‘గాడ్ ఫాదర్’లోనూ జరిగాయని అనుకోవచ్చా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us