Chiranjeevi Luck Came Together With Arrival Of Mega Little Princess : మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో చిరుకి లక్.. ఏకంగా రూ.2 వేల కోట్ల లాభం..
NQ Staff - August 4, 2023 / 05:47 PM IST
Chiranjeevi Luck Came Together With Arrival Of Mega Little Princess :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవలే పండంటి బిడ్డ పుట్టిన విషయం విదితమే.. మెగా లిటిల్ ప్రిన్సెస్ కు ”క్లీంకార”గా నామధేయం చేసిన విషయం తెలిసిందే.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లి తర్వాత 11 ఏళ్లకు పుట్టిన పాప కావడంతో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి పోయింది.
తమ ఇంటికి వారసురాలు వచ్చిందని మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటే ఎంత అపురూపమో ఇప్పటికే మెగాస్టార్ కూడా ఆయన మాటల్లో తెలిపారు.. మెగాస్టార్ అయితే తన మనవరాలిని చూసుకుని తెగ మురిసి పోతున్నారు. తమ గారాల ముద్దుల మనవరాలికి క్లీంకార అనే నామధేయం చేస్తూ ఆనందాన్ని తెలిపారు..
ఇక మనవరాలు రాకతో మెగాస్టార్ కు అదృష్టం బాగా వరించినట్టు తెలుస్తుంది.. అలా ఇలా కాదు ఏకంగా 2 వేల కోట్లు కలిసి వచ్చాయని అంటున్నారు.. అసలు మ్యాటర్ ఏంటంటే.. విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తులసి’లో యాంకర్ ఝాన్సీ కామెడీ సీన్ హైలెట్ గా నిలిచింది.. రిచ్ కోకాపేట ఆంటీగా ఝాన్సీ ప్రేక్షకులను బాగా నవ్వించింది.
కోకాపేటలో భూమి అమ్మితే లెక్కలేనంత డబ్బు వస్తుందని అప్పుడు చెప్పగా అది ఇప్పుడు నిజమైంది.
. కోకాపేటలో భూమి ధర రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో చిరుకి అదృష్టం అలా కలిసి వచ్చింది. అక్కడ ఎకరం ఏకంగా 100 కోట్లు దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అక్కడ మెగాస్టార్ కు 20 ఎకరాల భూమి ఉందట.. ఈ లెక్కన ఇప్పుడు ఈ భూమి అమ్మితే 2 వేల కోట్లు వస్తాయని అంతా మనవరాలు పుట్టిన వేళా విశేషం అని చెప్పుకుంటున్నారు.