CHIRANJEEVI: మొద‌లైన చిరంజీవి మిష‌న్.. ఇక ఆక్సిజ‌న్ లేక మృతి చెందార‌న్న వార్త‌లు వినం అంటున్న మెగాస్టార్

స్వ‌యంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల గురించి బాగా తెలుసు. గ‌తంలో రక్తం దొర‌క్క చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిసి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ స్థాపించారు. ఇక ఇప్పుడు క‌రోనా వ‌ల‌న ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. ఆక్సిజ‌న్ దొర‌క్క ఎంద‌రో మృత్యువాత ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన చిరు రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయ‌బోతున్నారు. రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి వీరాభిమాని అయిన మహేష్ (కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్) కర్ణాటకకు చెందిన చిరంజీవి అభిమానుల సహకారంతో సోమవారం ఉదయం ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ప్రారంభించారు.

తాజాగా అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ ప్రారంభించారు. ఈ రోజు ఉద‌యం 10.30ని.ల నుండి సేవ‌లు ప్రారంభం కానున్నాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క చ‌నిపోయార‌నే వార్త‌లు మ‌నం ఇక వినం అంటూ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.