Chiranjeevi: క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న చిరు అభిమాని.. వైద్యానికి పూర్తి ఖ‌ర్చు భ‌రిస్తాన‌ని మెగాస్టార్ హామీ

Chiranjeevi: స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవికి క‌ష్ట సుఖాలు ఏంటో తెలుసు. ఆయ‌న ఈ స్థాయికి వ‌చ్చారంటే ఎంతో క‌ష్టం ఉంది. అశేష‌మైన అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్న చిరంజీవి ఆప‌ద‌లో ఉన్న‌వారికి త‌న వంతు సాయం త‌ప్ప‌క చేస్తుంటారు.తాజాగా తన అభిమాని చావు బతుకుల్లో ఉన్న విషయం తెల్సుకుని ఆయన స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Help to his Fan Who Suffered with Cancer
Chiranjeevi Help to his Fan Who Suffered with Cancer

చిరంజీవి తన అభిమానులు అంటే ప్రాణం ఇస్తారు. కరోనా సమయంలో తన అభిమానులు కొంత మందికి చిరు అండగా నిలబడ్డారు. కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయిన తన అభిమానుల కుటుంబాల‌కు మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్ల క్రితం ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాల‌కు చిరంజీవి ఆర్థిక భ‌రోసానిచ్చారు

ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలంటే ముందుండే అభిమానులలో ఎవరికి కరోనా సోకినా వెంటనే వారితో మాట్లాడి ధైర్యం నింపుతూ అవసరమైతే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే కాక ఆయన ఆస్పత్రుల కు ఫోన్ చేసి డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కారణంగా మరణించిన అందరూ అభిమానుల కుటుంబాలకు మాట్లాడి ధైర్యానిచ్చిన చిరంజీవి వారి అకౌంట్లలో డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు.

గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విశాఖపట్నం చెందిన మెగాభిమాని వెంకట్ అనారోగ్య విషయం అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ద్వారా చిరంజీవి గారికి తెలిసింది. తెలుసుకున్న వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాల్సిందిగా మెగాస్టార్ కోరారు. పూర్తి వైద్య ఖర్చులను భరిస్తానని ఆయన మాటిచ్చారు.

దీంతో వెంకట్ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. సినిమాల విషయానికి వస్తే ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుంది.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతో సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు