Chiranjeevi: చిన్నారి పెద్ద మ‌న‌సుకు ముగ్దుడైన చిరంజీవి..

Chiranjeevi: స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి కి ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాలు, బాధ‌లు ఏంటో తెలుసు. అందుకే ఎప్పుడు ఏ క‌ష్టం వ‌చ్చిన కూడా త‌న వంతు సాయం చేస్తుంటారు. క‌రోనా వ‌ల‌న ఏర్ప‌డిన విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో సినీ ఇండ‌స్ట్రీ కార్మికుల‌కు చేయూత‌గా నిలిచారు చిరు. ఇక క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ఆక్సిజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ బ్యాంక్‌ల‌ను ఏర్పాటు చేయించారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్ అందుబాటులోకి రాగా, ఇది రోగుల పాలిట వ‌రంగా మారింది.

Chiranjeevi Heartfelt Message On Child Donation
Chiranjeevi Heartfelt Message On Child Donation

ఈ మహోత్తర కార్యక్రమాన్ని చిరంజీవి ఇటీవ‌లే ప్రారంభించ‌గా, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే ఇంత గొప్ప కార్య‌క్ర‌మం చేప‌డుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్నారి ఆలోచన మరింత ఇన్స్‌పిరేషన్ ఇచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇవ్వ‌గా, ఈ విష‌యాన్ని చిరు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

‘పి.శ్రీనివాస్, శ్రీమతి హరిణి గార్ల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్ 1న తన బర్త్ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ‘తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని’ చిన్నారి అంటుంది. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినపోయాను. అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే.. లవ్ యూ డార్లింగ్’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి త‌న వీడియోలో తెలిపారు.

చిరంజీవి మొద‌లు పెట్టిన కార్య‌క్ర‌మానికి మంచి మ‌ద్దతు ల‌భిస్తుంది. ఈ మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మంలో చాలా మంది అభిమానులు భాగం కావ‌డ‌మే కాకుండా త‌మ వంతు విరాళాలు కూడా అందిస్తున్నారు. అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్ర‌మంకు ఇంకా ఆద‌ర‌ణ రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మే 13న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఓ ప‌ది రోజుల‌లో షూటింగ్ పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా మూవీని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

“శ్రీనివాస్‌-హరిణిల కూతురు అన్షి ప్రభాల. నేడు(జూన్‌ 1) ఆమె బర్త్‌డే. తను దాచుకున్న డబ్బులతోపాటు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆక్సిజన్‌ బ్యాంకుల కోసం చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషమని ఆ చిన్నారి అంటోంది. ఆమె ఆలోచనకు, మంచి మనసుకు, తన ప్రేమకు ముగ్ధుడినైపోయాను. అన్షి స్పందించిన తీరు నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్‌స్పైర్‌ చేసింది. తన కలలన్నీ నిజం కావాలని, ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారి చేతుల మీదుగా ఆ భగవంతుడు మా ప్రయత్నానికి చేయూతనిస్తూ ఆశీస్సులను అందిస్తున్నాడని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే, లవ్‌ యూ డార్లింగ్‌” అని చిరంజీవి పేర్కొన్నాడు.