Chiranjeevi Granddaughter: నెక్ట్స్ జ‌న‌రేష‌న్ మెగా కిడ్స్‌ని ఒకే ఫ్రేములో చూస్తే ఆ కిక్కేవారు..!

Chiranjeevi Granddaughter: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అస‌మాన న‌ట‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న చిరంజీవి చాలా మందికి స్పూర్తిగా నిలిచారు. ఆయన స్పూర్తితో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు తమ.. తమ.. టాలెంట్‌ను ప్రదర్శించుకున్నారు. ఇటీవల వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేయ‌గా, ఆయ‌న న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

ఇక మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా వారసుడు అనుకుంటున్నారా? పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొడుకు అఖిరానందన్. ఇతడి కోసం ప్రొడ్యూసర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారని టాక్‌. అఖిరానందన్‌ ఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నట వారసుడిగా ముందుగా నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. కానీ చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు సత్తా చాటారు. ఇక చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ కూడా హీరోగా బుడి బుడి అడుగులు వేస్తున్నాడు. పెద్దల్లుడు విష్ణు ప్రసాద్.. వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ నిర్మాతగా రాణిస్తున్నాడు.

నిహారిక కూడా కథానాయికగా ఎంట్రీ ఇచ్చి పెళ్లి చేసుకొని సెటిలైంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్..’ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి ఔరా అనిపించాడు. నిర్మాత అల్లు అరవింద్‌ బావమరిది కొడుకు విరాన్ ముత్తంశెట్టి..హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఇక మెగా ఫ్యామిలీ నుండి నెక్ట్స్ జ‌న‌రేష‌న్ స్టార్స్ కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. మెగా కుటుంబంలో ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగినా డజను మంది కిడ్స్ కనిపిస్తున్నారు. తాజాగా శ్రీజ కుమార్తె బేబి నివృతి బర్త్ డే వేడుకల్లో కిడ్స్ అంతా ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో సుశ్మిత పిల్లలు.. శ్రీజ వారసులు సహా బన్ని కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు. ఇందులో క్యూట్ అర్హ సందడి కనిపిస్తోంది.

వీరంతా రాబోయే కాలంలో ప్రేక్ష‌కుల‌ని అల‌రించబోయే న‌టీన‌టులు అని నెటిజ‌న్స్ అని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ కి ముగ్గురు కిడ్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు కూడా అప్పుడ‌ప్పుడు మెగా ఫ్యామిలీని క‌లుస్తుంటారు. రానున్న రోజుల‌లో వీరు కూడా వెండితెర‌పై సంద‌డి చేస్తార‌నే టాక్ న‌డుస్తుంది.