God Father : గాడ్ ఫాదర్ చూసిన సెన్సార్ వాళ్లు ఏమన్నారంటే..!

NQ Staff - September 26, 2022 / 08:42 PM IST

God Father : గాడ్ ఫాదర్ చూసిన సెన్సార్ వాళ్లు ఏమన్నారంటే..!

God Father : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి ఈ సినిమా రీమేక్ అనే విషయం కూడా తెలిసిందే.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార మరియు సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు మరో 10 రోజులు ఉండగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మరింత జోష్ తో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో అనంతపురంలో మెగాస్టార్ చిరంజీవి యొక్క గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఏర్పాటు ఇప్పటికే అక్కడ ప్రారంభమయ్యాయి.

అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి యొక్క ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో లు బయటకు రాబోతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు పాజిటివ్ గా స్పందించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

లూసీఫర్ కి ఏ మాత్రం తగ్గకుండా తెలుగు నేటివిటీకి మంచి మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించిన తీరు బావుందంటూ దర్శకుడు మోహన్ రాజా పై ప్రశంసలు గుర్తించారట. ఇక చిరంజీవి లాంటి తరహాలో కనిపించడం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కాస్త ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ వారు పాజిటివ్ టాక్ ఇవ్వడంతో తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందంటూ మెగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us