Chiranjeevi: గెట‌ప్ శీనుకి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: బుల్లితెర పై తెలుగు ప్రేక్షకులను అందరినీ కడుపుబ్బ నవ్వించే కార్యక్రమం జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్య‌క్ర‌మంతో చాలా మంది ఫేమ్ అయ్యారు. కొంద‌రు స్టార్స్‌గా మారారు. మ‌రి కొంద‌రు క్ష‌ణం తీరిక‌లేకుండా గడుపుతున్నారు. జబర్దస్త్ షో లో కామెడీ సీన్స్ చేసే వ్యక్తి హీరోగా మారడం ఎప్పటి నుంచో మనం గమనిస్తూనే ఉన్నాం.

Chiranjeevi

జబర్దస్త్ షోలో బాగా ఆకట్టుకున్న షకలక శంకర్ సినిమాలు చేస్తూ హీరోగా ముందుకు కొనసాగుతున్నాడు. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అవి ఏమీ ఆలోచించకుండా సినిమాలు చేసేందుకు మక్కువ చూపుతున్నాడు గెటప్ శీను కూడా హీరోగా అల‌రిస్తున్నాడు.

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు అంటే కెరీర్ మొదలు పెట్టక ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట శీను. నిజానికి తినడానికి తిండి లేని పరిస్థితి, కడుపు మార్చుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయట. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద బ్రతకడానికి హైదరాబాద్ కి వచ్చిన శ్రీను కొన్ని రోజులు తన పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాడట.

ఇక తన పిన్ని తనని ఎంతో ఆప్యాయంగా చూసుకునేదట. కానీ అలా ఎన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోని అక్కడినుంచి వెళ్ళిపోయాడట శ్రీను. ఎన్నో పూటలు తిండి మానుకొని ఉండగా ఓ సారి దానిమ్మ చెట్టు కొమ్మలు తమ స్థలంలోకి వంగి ఉండటంతో కాయలను కోసుకొని తిందామని అనుకున్నాడట. కానీ ఎక్కడ కాయలు కనిపించకపోవడంతో పిందెలు మాత్రమే ఉండటంతో ఆకలితో తట్టుకోలేక వాటిని తినేసాడట.

జీవితంలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించిన గెట‌ప్ శీను ఇప్పుడు సినిమాలు, షోస్ చేస్తున్నాడు. అయితే ఆయ‌న యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి వారు చాలా సంతోషించారు. జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు అంటూ శీను సంతోషం వ్య‌క్తం చేశాడు.