Sruthi Hassan : శృతి హాసన్ కు జ్వరం.. బాలయ్య పై చిరంజీవి పరోక్ష కౌంటర్‌

NQ Staff - January 8, 2023 / 11:20 PM IST

Sruthi Hassan : శృతి హాసన్ కు జ్వరం.. బాలయ్య పై చిరంజీవి పరోక్ష కౌంటర్‌

Sruthi Hassan : వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైజాగ్ లో భారీ ఎత్తున జరిగింది. ఏయూ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనక పోవడం పట్ల చర్చ జరిగింది.

రెండు రోజుల క్రితం బాలకృష్ణ తో కలిసి ఆమె నటించిన వీర సింహా రెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒంగోలులో కనిపించిన శృతి హాసన్.. చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎందుకు కనిపించలేదు అంటూ చాలా మంది ప్రశ్నించారు.

ఈ విషయమై చిరంజీవి మాట్లాడుతూ శృతి హాసన్ ఒంగోలులో ఏం తినిందో ఏమో.. లేదంటే ఎవరైనా బెదిరించారో ఏమో జ్వరం తెచ్చుకుంది అంటూ ఇండైరెక్టుగా నందమూరి బాలకృష్ణ పై చిరంజీవి కౌంటర్ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

వీర సింహా రెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బాలకృష్ణ రకరకాలుగా చిత్ర విచిత్రంగా చిన్న పిల్లడి మాదిరిగా డాన్స్ చేయడం సరదాగా చిందులు వేయడం చేశారు. వాటిని చూసి శృతి హాసన్ కి ఏమైనా జ్వరం వచ్చిందా అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని శృతి హాసన్ తప్పించుకోవడం మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us