Chiranjeevi : చిరంజీవి ఆ డైరెక్టర్ ని ఒక్క సినిమాకే ఆయనతో పోల్చాడంటే ఉప్పెన బ్లాక్ బస్టర్ ..!

Chiranjeevi : చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా అందరికీ అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఏ చిన్న సహాయం కావల్సి వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. అంతేకాదు ఒక సినిమా బావుందని ఆయన మనసుకు అనిపిస్తే ఆ చిత్ర బృందాన్ని ప్రత్యేంగా అభిమానిస్తూ ఇండస్ట్రీలో ఇంకా మంచి చిత్రాలు తీయాలంటూ ప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి తన సినిమాలలో నటించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ఉప్పెన త్వరలో థియేటర్స్ లోకి రాబోతోంది.

chiranjeevi-Chiranjeevi comparing the director with him in only one film is a surge blockbuster ..!
chiranjeevi-Chiranjeevi comparing the director with him in only one film is a surge blockbuster ..!

తాజాగా ఈ సినిమాని చిరంజీవి చూడటం జరిగిందట. అయితే ఉప్పెన సినిమా చూసిన చిరంజీవి కి ఈ సినిమా విపరీతంగా నచ్చిందని.. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అంటూ నమ్మకాన్ని వ్యక్తపరచినట్టు తాజా సమాచారం. సినిమా పట్ల మెగాస్టార్ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తుంటారు. ఆయన జడ్జ్‌మెంట్ 100 పర్సెంట్ జమవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా మెగాస్టార్ సూపర్ హిట్ అవడం పక్కా అన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మాట వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా విషయంలో కూడా వినిపిస్తోంది.

Chiranjeevi : భారతీరాజా తో ఉప్పెన దర్శకుడిని పోల్చిన మెగాస్టార్ ..!

అంతేకాదు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సానా ని ఏకంగా సీనియర్ దర్శకులు భారతీరాజా తో పోల్చి ఆకాశానికి ఎత్తేశారు మెగాస్టార్. భారతీరాజా సినిమాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి గొప్ప దర్శకుడితో ఉప్పెన దర్శకుడిని పోల్చుతు ప్రశంసలు కురిపించారట మెగాస్టార్. దాంతో చిత్ర యూనిట్ ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్సైపోయారు. ఇక వైష్ణవ్ తేజ్ కి జంటగా కృతిశెట్టి నటించగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ ట్రెండింగ్ లో నిలిచాయి. కాగా ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Advertisement