Chiranjeevi: చిరు బ‌ర్త్‌డే.. 50 రోజుల ముందు నుండే హ‌డావిడి మొద‌లు పెట్టిన ఫ్యాన్స్‌

Chiranjeevi: ఒక‌ప్పుడు ఎంత పెద్ద స్టార్ అయిన ఒక రోజు లేదంటే రెండు రోజుల ముందు నుండి బ‌ర్త్ డే హంగామా ఉండేది. సోష‌ల్ మీడియా ప్రాముఖ్యత పెరిగిన‌ప్ప‌టి నుండి రెండు నెల‌లు మూడు నెల‌ల ముందు నుండే సెలబ్రేష‌న్స్ స్టార్ట్ చేస్తున్నారు. ప్ర‌త్యేక డీపీతో పాటు ఓ హ్యాష్ ట్యాగ్‌ని రూపొందించి దాంతో సోష‌ల్ మీడియాలలో తెగ హ‌డావిడి చేస్తున్నారు. అంతేకాదు ఆ హ్యాష్ ట్యాగ్ ఎంత‌గా ట్రెండ్ అనే దానిపై రికార్డుల లెక్క‌లు కూడా వేస్తున్నారు.

మెగా అభిమానుల ఆరాధ్య దైవం చిరంజీవి పుట్టి రోజు ఆగ‌స్ట్ 22. ఈ రోజు వారికి ప్ర‌త్యేక‌మైన దినం. మునుపటితో పోలిస్తే ఈసారి మెగా బర్త్ డేకి చాలా ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ కొన్ని దశాబ్ధాల క్రితమే బ్లడ్ బ్యాంక్- ఐ బ్యాంక్ వంటివి ప్రారంభించి ప్రజాసేవలో ఉన్నారు. ఈసారి కరోనా క్రైసిస్ కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి మెగా సేవలు పదింతలయ్యాయి. కష్టంలో నిజంగానే దేవుడయ్యారు.

ప్ర‌జ‌ల క‌ష్టాల‌ని చూసి చ‌లించిన చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ ప్రారంభించ‌డ‌మే కాకుండా సినీ ఇండ‌స్ట్రీలో కార్మికులు ప‌డుతున్న బాధ‌ల‌కు త‌గిన సాయం చేయాల‌ని భావించి కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించాడు. సినీకార్మికులు జర్నలిస్టుల కుటుంబాలను సహా ఎందరినో ఆదుకున్నారు మెగాస్టార్. కనీస నిత్యావసరాల్ని నెలలపాటు సరిపడేలా సరఫరా చేశారు.

రియ‌ల్ హీరోగా కొనియాడ‌బ‌డుతున్న చిరంజీవి బ‌ర్త్ డేని ఈ సారి ప్రత్యేకంగా చేయాల‌ని అభిమానులు ప్లాన్స్ వేస్తున్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఇప్పటికే బిగ్ డే కోసం ముందుగానే ప్రణాళిక వేసింది. ఈ సంవత్సరం వారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కొత్త నినాదాన్ని విడుదల చేశారు. మునుముందు పర్యావరణం ప్రమాదకరంగా మారనుంది. అందుకే చిరంజీవి నుండి ప్రేరణ పొంది “పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటాలి!“ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

ఆగస్టు 9 నుండి ఆగస్టు 22 వరకు వారు ప్రతి మెగా అభిమానిని తొమ్మిది మొక్కలు నాటాలని ఆదేశాలు అందుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగే అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. 50రోజుల్లో చిరంజీవి బ‌ర్త్‌డే రోజు రానుండ‌డ‌గా, ఆ పుట్టినరోజు వేడుకల పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.# ChiruBday2020 వైరల్ గా మారుతోంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మేలోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అంతా బాగుంటే చిరంజీవి బ‌ర్త్‌డే వ‌ర‌కు ఏమైన రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఆచార్య త‌ర్వాత చిరు లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.