Megastar Chiranjeevi : ఆకలి తట్టుకోలేక పక్కింట్లో దొంగతనం చేసిన చిరంజీవి.. ఘోరమైన అవమానం..!

NQ Staff - March 17, 2023 / 05:34 PM IST

Megastar Chiranjeevi : ఆకలి తట్టుకోలేక పక్కింట్లో దొంగతనం చేసిన చిరంజీవి.. ఘోరమైన అవమానం..!

Megastar Chiranjeevi : ఇప్పుడు మెగాస్టార్ అంటే అందరికీ టక్కున చిరంజీవి పేరు చెప్పేస్తారు. ఎవరి సపోర్టు లేకుండా వచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు చిరు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఆయన నెంబర్ వన్ హీరోగా రాణించారు. అయితే ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు.

సినిమాల్లో పిచ్చితో చెన్నైకి వెళ్లినప్పుడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లు ముగ్గురూ ఒకే రూమ్ లో ఉండేవారు. అవకాశాల కోసం రోజూ ఇండస్ట్రీ చుట్టూ తిరిగేవారు. ఒకానొక సమయంలో వారికి తనడానికి తిండి కూడా ఉండేది కాదు. అలాంటి సమయంలో కూడా వారు ఇంటి నుంచి డబ్బులు అడగలేదు.

కూర వండుకోవడం కోసం..

ఈ క్రమంలోనే ఓరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేవు. చిరంజీవితో పాటు సుధాకర్ రూమ్ లోనే ఉన్నారు. ఆకలికి తట్టుకోలేక పోయారు. దాంతో పక్కింట్లో ఉన్న ములక్కాయ చెట్టుకు ఉన్న కాయలను దొంగతనం చేసి కూర వండుకోవాలని భావించారు. అనుకున్నట్టు గానే వారిద్దరూ ములక్కాయలను దొంగిలించారు.

కూర వండుకుంటున్న సమయంలో పక్కింటి ఓనర్ వచ్చి మా ములక్కాయలు ఎలా దొంగతనం చేస్తారంటూ తిట్టి ఆ కూరను కూడా లాక్కెళ్లాడు. ఈ విషయాలను గతంలో సుధాకర్ చెప్పుకొచ్చాడు. అప్పుడు అవమానంగా భావించిన వారు.. ఎలాగైనా అవకాశాలు పట్టి స్టార్లుగా ఎదగాలని భావించారు. అనుకున్నట్టు గానే వారు స్టార్లుగా రాణించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us