Chiranjeevi: చిరంజీవి భామ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..!

Chiranjeevi:18 ఏళ్ల వ‌య‌స్సులో మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ మీనాక్షి శేషాద్రి. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఆప‌ద్భంద‌వుడు చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీనాక్షికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. 80,90వ ద‌శ‌కంలో ఆమె టాప్ హీరోయిన్‌గా మారి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా నటించి తనకంటూ ఓ గుర్తింపును సాధించింది. అందంతో పాటు మీనాక్షి అభిన‌యానికి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్దుల‌య్యారు.

chiranjeevi

బాలీవుడ్‌లో మరోసారి చిరంజీవి సరసన గ్యాంగ్‌లీడర్‌ రీమేక్‌ చిత్రం ఆజ్ కా గూండారాజ్ సినిమాలోనూ నటించింది. అలా బాలీవుడ్‌లో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన మీనాక్షి కెరియర్ పీక్స్‌లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది. ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటుంది. టెక్సాస్‌లో భారతీయ సంప్రదాయ నృత్యాల శిక్షకురాలిగా బిజీగా ఉన్నారు. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి కాగా, జార్ఖండ్ రాష్ట్రంలోని సింధ్రిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె.. భరతనాట్యం, కూచిపూడి, కథక్, లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించింది.

పెయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, సుభాష్‌ ఘాయ్‌ డైరక్షన్‌లో తెర‌కెక్కిన‌ హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం స‌మాజసేవ, అందుకు సంబంధించి నిధుల సేకరణ చేపడుతూ జీవితాన్ని కొన‌సాగిస్తుండ‌గా, కొద్ది రోజుల క్రితం ఆమె చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం చేశారు. దీనిని ఖండించింది మీనాక్షి. అయితే తాజాగా మీనాక్షి శేషాద్రికి సంబంధించిన ఫొటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో మీనాక్షి క‌ళ‌త‌ప్పిన‌ట్టు క‌నిపిస్తున్నారు. అంద‌మైన న‌టిని ఇలా చూసిన అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.