Chiranjeevi: బాల‌కృష్ణ మీరు ఎల్ల‌ప్పుడు సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను

Chiranjeevi: నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ అశేష అభిమానాన్ని పొందాడు. ఎక్కువ‌గా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బాల‌య్య ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ఈ రోజు బాల‌కృష్ణ 61వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు, స‌న్నిహితులు, ప్ర‌ముఖులు, శ్రేయోభిలాషులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

బాల‌య్య బ‌ర్త్ డే హంగామా సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతుంది. చిరంజీవి, ఎన్టీఆర్, నారా బ్రహ్మణి, కళ్యాణ్ రామ్ , అనీల్ రావిపూడి, గోపిచంద్ మ‌లినేని ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను అని జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. క‌ళ్యాణ్ రామ్ త‌న సోషల్ మీడియాలో.. 61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కూడా తన తండ్రికి ప్రత్యేకంగా విషెస్ అందజేశారు. పవర్ హౌస్ అంటూ తన నాన్నను బ్రాహ్మణి పొగిడేశారు. నందమూరి ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్ల సమరానికి ట్విట్టర్‌లో బాలయ్య బాబు పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది.

ప్ర‌తి ఏడాది బాల‌య్య బ‌ర్త్ డే వేడుక‌ని జ‌రిపేందుకు అభిమానులు బాల‌కృష్ణ ఇంటికి త‌ర‌లి వచ్చేవారు. కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఈసారి అలాంటి కార్య‌క్ర‌మాలు వ‌ద్ద‌ని, అంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మై ఉండాలని ఆయ‌న కోరిన సంగ‌తి తెలిసిందే. ‘‘నా ప్రాణ సమానులైన అభిమానులకు విజ్ఞ‌ప్తి. జూన్ 10న నా పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తోన్న‌ ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు.

నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానమే. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానుల‌కు, కార్యకర్తలకు, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సినిమా విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ‘అఖండ’ , గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ చిత్రంలో న‌టిస్తున్నారు.