Chiranjeevi: చిరు, రామలింగయ్య అల్లుడు ఎలా అయ్యాడో తెలుసా!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మాస్ యాక్షన్, స్టైల్ డాన్స్, అల్టిమేట్ యాక్టింగ్, విలక్షణమైన, విభిన్నమైన కథలతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పునాది రాళ్ళు సినిమా నుండి ఖైధీ నంబర్ 150 వరకు ఎన్నో పాత్రలతో, ఎన్నో అనుభవాలను ఎదుర్కున్నారు. అదే రేంజ్ లో కెరీర్ ను నిలబెట్టుకున్నారు. అయితే మెగాస్టార్ గా తన కెరీర్ వేగం అందుకోకముందు చాలా తక్కువ రీతిలో ఆయనకు సినీ అవకాశాలు వచ్చేవి.

Chiranjeevi And Surekha Marriage Story
Chiranjeevi And Surekha Marriage Story

ఈ క్రమంలోనే చిరంజీవి, ప్రముఖ హస్యనటులు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అసలు చిరు, అల్లు వారింటి అల్లుడు ఎలా అయ్యాడో తెలుసా.. ఒకప్పటి మేకప్ మెన్ జయకృష్ణ తర్వాత కాలంలో నిర్మాతగా మారారు. ఆయన చిరంజీవికి, అల్లు రామలింగయ్య గారికి చాలా దగ్గరివారు. ఒకరోజు చిరుని వెంట తీసుకుని అల్లు వారింటికి వెళ్ళారు.

ఆ టైమ్ లో రామలింగయ్య ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య వచ్చి సకల మర్యాదలు చేశారు. అలా పెళ్ళి అయ్యాక తెలిసిందట చిరంజీవికి ఇచ్చిన కాఫీ చేసింది సురేఖ అని.. ఆ తర్వాత చిరంజీవి ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసావా అని అడిగితే, సురేఖ తాను లోపలే ఉన్నానని బయటకు వస్తే మా నాన్న ఊరుకోరని చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అల్లు రామలింగయ్యకు తమ పిల్లల్ని ఇండస్ట్రీ నటులకు ఇవ్వడానికి సిద్ధపడలేదట. కానీ నిర్మాత జయకృష్ణ మధ్యలో ఉండి చిరంజీవి సురేఖ కు 1980 ఫిబ్రవరి 20 న పెళ్ళి జరిపించారట. అయితే అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు, ఓ తండ్రిగా చిరంజీవికి సురేఖ బాధ్యతలు అప్పజెప్పారట.

చిన్నతనం నుండి సురేఖ చాలా నెమ్మదస్తురాలని.. తనని జాగ్రత్తగా చూసుకోవాలని, తనకు ఏం కావాలన్నా నోరు తెరిచి అడిగేది కాదని.. నువ్వే ఆమెకు ఏం కావాలన్నా నెరవేర్చాలని భావోధ్వేగానికి గురయ్యారట. అలా అల్లు రామలింగయ్య గారికి చిరంజీవి అల్లుడు అయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్ కి తిరుగే లేదు.