Naatu Naatu : ఆస్కార్ నామినేషన్స్ లో మన నాటు పై చిరు, బాలయ్య ఏమన్నారంటే..!
NQ Staff - January 24, 2023 / 10:42 PM IST

Naatu Naatu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దక్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నిలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు ఇంకా ఎంతో మంది స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… సినిమా వైభవాన్ని చాటేందుకు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. కోట్లాది మంది ఆకాంక్ష, కోరిక మార్చి 12న ఫలించాలని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.
బాలకృష్ణ స్పందిస్తూ… ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడం గొప్ప ఆనందాన్ని కలిగించింది. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా నా శుభాకాంక్షలు. డాక్యుమెంటరీ కేటగిరీలో మన మరో ఇండియన్ సినిమాకు కూడా నామినేషన్ దక్కడం పట్ల బాలయ్య హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మరియు సినిమా రంగంలోని ఎంతో మంది కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు దక్కించుకున్న అద్భుతమైన గౌరవానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.