Chiranjeevi Acharya : ఆచార్య కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయా.. పంపిణీ దారులతో మెగాస్టార్ చర్చలలో నిజమెంత?
NQ Staff - May 2, 2022 / 09:51 AM IST

Chiranjeevi Acharya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోకపోయిన బిడ్డగా తనవంతు సాయాలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఆపదలో చేయూతనందిస్తున్నారు. కరోనా సమయంలో సినిమా కార్మికుల కోసం ఆయన చేసిన సేవలుకు ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. అయితే కష్ట నష్టాల్లో తమ నిర్మాతలు పంపిణీ వర్గాలకు ఎప్పుడూ అండగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ఈసారి కూడా తన సహృదయతను చాటుకుంటున్నారని తెలిసింది.

Chiranjeevi Acharya movie Collections
ఇటీవలే చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో నటించిన ఆచార్య విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి ఆరంభమే డివైడ్ టాక్ రావడంతో వసూళ్ల పైనా దాని ప్రభావం కనిపించింది. తాజా సమాచారం మేరకు.. ఆచార్య వల్ల నష్టాల భారిన పడనున్న పంపిణీదారులను ఆదుకునేందుకు మెగాస్టార్- రామ్ చరణ్ ముందుకు వచ్చారని తెలిసింది.
పంపిణీ దారుల్లో ఎవరైతే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారో వారికి ఒక్కొక్కరికి రూ.5కోట్లు చొప్పున రిటర్న్ ఇచ్చేందుకు చిరు అంగీకరించారని గుసగుస వినిపిస్తోంది. ఇతరులకు మాత్రం చిరు నటిస్తున్న `గాడ్ ఫాదర్` రైట్స్ ద్వారా కాంపన్సేషన్ ఉంటుందట. ఆచార్య చిత్రంలో నటించినందుకు చిరు-చరణ్ సంయుక్తంగా 70కోట్ల వరకూ పారితోషికం అందుకున్నారని కథనాలొస్తున్నాయి.
స్టార్ హీరోలు ఇద్దరూ స్వార్థ ప్రయోజనాలకు కాకుండా నష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావడం వారి మంచితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆచార్య చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత అన్న సంగతిని మరువకూడదు. ఒక నిర్మాతగా పదిమంది మంచి కోరుకోవడం చరణ్ ప్రత్యేకత అని నిరూపణ అవుతోంది.