Chiranjeevi : ఆ విషయాన్ని రోజానే అడగాలన్న చిరంజీవి
NQ Staff - January 11, 2023 / 11:27 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను గురించి చిరంజీవి స్పందిచాడు.
ఇటీవలే చిరంజీవి ని మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో నాగబాబు స్ట్రాంగ్ గా రోజాకు కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదు అంటూ ఆమెకు చాలా మంది కౌంటర్ ఇచ్చారు.
తాజాగా చిరంజీవి స్పందించాడు. అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తనను నా ఫ్యామిలీని తిడుతున్నారు అంటూ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ప్రశాంతతే ముఖ్యం. తన గురించి ఎవరు మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకోను.
మంత్రి అయిన వెంటనే రోజా నన్ను కలిసింది. నన్ను ఎందుకు ఆమె విమర్శించిందో ఆమెనే అడగాలి. ఆమె ఎందుకు నన్ను విమర్శించింది అనే విషయాన్ని నేను ఆలోచించను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.