Chinmayi Sripada: వ్య‌భిచారం చేస్తే త‌ప్పేంటి.. చిన్మ‌యి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chinmayi Sripada: సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కాస్టింగ్ కౌచ్ ఉదృతంగా ఉన్న సమ‌యంలో త‌న స్పంద‌న కూడా ప‌లు సార్లు తెలియ‌జేస్తూ సంచ‌ల‌నంగా మారింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చిన్మయి అప్పుడ‌ప్పుడు లైంగిక సంబంధ‌మైన విష‌యాల‌పై స్పందిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆమెని అచ్చ తెలుగులో పచ్చి బూతులు తిడుతూ చిన్మయిని దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.

Chinmayi Sripada Fires on Netizens Abusive Words
Chinmayi Sripada Fires on Netizens Abusive Words

బూతు ప‌దాల‌పై కొన్ని సార్లు సైలెంట్‌గా ఉంటుంది, మ‌రి కొన్ని సార్లు స్పందిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా చిన్మయి చేసిన పోస్ట్ మీద ఓ నెటిజన్ బూతు మాటతో రిప్లై ఇచ్చాడు. అలా తనను తిట్టడంపై చిన్మయి స్పందించింది. ‘అదేంటో ఆడవాళ్లను బూతులు అనాలంటే ల** అని అంటాం. ఇంగ్లీష్‌లో స్లట్ అని అంటారు.

ఎక్కువ మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకునే అబ్బాయిలను మాత్రం స్టడ్ (STUD) అంటాం. అతను ఏదో సాధించినట్టు. ఆడవాళ్లను పడక మీద సుఖపెడితేనే మంచోళ్లు, గొప్పోళ్లు అని అనుకుంటారా? ఏదో అది దేవుడికే తెలియాలి.వ్య‌భిచారం చేయించేందుకు అమ్మాయిలని కిడ్నాప్ చేస్తూ, ఫోర్స్ చేస్తూ, ట్రాఫికింగ్ చేస్తూ ఏమేమో జరుగుతాయ్.

సెక్స్ వర్క్‌ను కించపరుస్తున్న వాళ్లు దుర్మార్గులు. వ్యభిచార గృహాన్ని నడిపే మగాళ్లు ఎవరు అని? ఎవరు అడగరు. దారి లేక గతి లేక వేరే పని చేయలేక.. కరువుతో, అన్నం లేక, పేదరికం అంటే మొదటగా అమ్మేది ఆడవాళ్లనే. వ్యభిచార వృత్తిని వదిలేసి సమాజంలోకి వస్తే వారికి గౌరవం, పని కల్పించి చూస్తున్నట్టు మాట్లాడతారు. సెక్స్ వర్కర్లతో పని చేయించుకుంటున్న మగాళ్లని ఏమనాలి?.

నాకు తెలిసి సెక్స్ వర్కర్లు ఎలాంటి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అది ఎన్నో దేశాల్లో చట్టబద్దం కూడా. దాన్ని ఆడవారికే ఎందుకు ఆపాదిస్తున్నారు? ఆడవాళ్లు ఆ పదం అంటే కరెక్ట్. ఎలాంటి అవకాశాలు లేక చివరకు ఆ వృత్తిని ఎంచుకుంటారు. ఎంతో మంది బలవంతంగా దాంట్లోకి లాగబడతారు. కాబట్టి నోర్మూసుకుని ఉండండి. నా వ్యక్తిత్వం, నా గౌరవం నా యోనిలో ఉండదు. జననాంగంతో మనిషిని జడ్జ్ చేయకండి అన్నట్టుగా చిన్మయి అందరికీ కౌంటర్ వేసింది.