Rahul సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఒకప్పుడు అయితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్.. మరీ ముఖ్యంగా సమంతకు గొంతును అరువిచ్చే అమ్మాయి అంటూ ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఇంట్రడక్షన్ ఇచ్చే అవసరం వచ్చేది. కానీ గత రెండు మూడేళ్లుగా చిన్మయికి ఆ అవసరమే రావడం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాంలో చిక్కుకుంటూ.. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ.. తప్పు చేసిన వారిని నిందిస్తూ.. మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ వార్తల్లోనే ఉంటుంది.
అలాంటి చిన్మయి గురించి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు చిన్మయి అంటే కేవలం సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.ఎంతో మంది బాధలను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతోన్న అమ్మాయిలకు ప్రతినిధి. మొత్తం దక్షిణాదిలో చిన్మయి ఇప్పుడు స్టార్. మహిళల కోసం, వారిపై జరిగిన అన్యాయాల గురించి చెప్పే ఓ శక్తిలా మారింది. చిన్మయికి రోజుకి కొన్ని వందల వేల మెసెజ్‌లు వస్తుంటాయి. అక్కడ వారు అలా చేశారు.. ఇలా చేవారు.. నాకు ఆ అన్యాయం జరిగింది.. ఇలా జరిగిందంటూ వాపోతుంటారట.

రాహుల్ నిన్ను ఎలా భరిస్తున్నాడో..: Rahul
అలా చిన్మయి రోజూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తుంటుంది. అయితే చిన్మయి చేసే పనులు మంచివే అయినా కూడా అందులో పురుషులపై ద్వేషం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. పక్కా ఫెమినిస్ట్ భావాలతో ఆమె చేసే పోస్ట్‌ల పై ఎక్కువగా నెగెటివిటీయే వస్తుంటుంది. కొందరు చిన్మయిని తిట్టి అలిసి ఆమె భర్త, హీరో రాహుల్ రవీంద్రన్‌పై జాలి పడుతుంటారు. ఈమెను ఎలా భరిస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతుంటారు. అలా తాజాగా ఓ నెటిజన్ కామెంట్ పెడితే చిన్మయి కాస్త ఘాటుగానే స్పందించింది.
నెటిజన్ పై ఘాటుగా స్పందించిన చిన్మయి
ఇగో ఈ మనిషి అలా హర్ట్ అయ్యాడు.. దాన్ని ఎలా చూపించాలో తెలియక.. నా వల్ల రాహుల్ బాధపడుతున్నాడట.. నన్ను ఎలా భరిస్తున్నాడని అడుగుతున్నాడు..అందరూ ఇలాగే అంటున్నారు.. దీన్నే పురుషాధిక్యత అంటారు.. మామూలుగా నాలాంటి ఆడదాన్ని వాళ్లు భరించలేరు.. రాహుల్‌నే అడగండి మీరు అంత ఫీలయ్యారంటే.. ఎలా భరిస్తున్నాడో అని అంటూ చిన్మయి కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇలాంటి మెసెజ్‌లు రావడం చిన్మయి ఎంతో కామన్ అయిపోయింది.