Childhood Photos Of Heroines Are Viral : ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. ఇండియాలో లెజెండరీ హీరోయిన్..!

NQ Staff - July 16, 2023 / 11:36 AM IST

Childhood Photos Of Heroines Are Viral  : ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. ఇండియాలో లెజెండరీ హీరోయిన్..!

Childhood Photos Of Heroines Are Viral :

మన దేశంలో సినీ తారలకు ఉండేంత ఫాలోయింగ్ ఇంకెవరికీ ఉండదనే చెప్పుకోవాలి. అందుకే వారికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తర్వాత హీరోలు, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పైన మనకు కనిపించే ఫొటో ఏ హీరోయిన్ దో చెప్పండి.. ఆమె ఒక లెజెండరీ హీరోయిన్. అప్పట్లో ఇండియా వ్యాప్తంగా అగ్ర హీరోయిన్ గా రాణించింది. దాదాపు 7 భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. స్టార్ హీరోల రేంజ్ లో ఆమె రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమె ఎవరో కాదండోయ్ జయప్రద.

ఏడు భాషల్లో సినిమాలు..

భూమికోసం సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. కానీ రజినీ కాంత్ హీరోగా కె.బాలచందర్ తీసిన ‘అంతులేని కథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి ఆమె వెను దిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ ఇలా దాదాపు అన్ని భాషల్లో అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది.

Childhood Photos Of Heroines Are Viral

Childhood Photos Of Heroines Are Viral

అప్పట్లోనే ఆమె హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది. చివరకు ఆమె హాలీవుడ్ లో కూడా నటించింది. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బాగానే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నారు ఆమె.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us