Chenna kesava Reddy Movie : 300 థియేటర్లలో ‘చెన్నకేశవరెడ్డి’: బసవ తారకం ఆసుపత్రి కోసం ఆ వసూళ్ళు.!

NQ Staff - September 22, 2022 / 07:22 PM IST

160139Chenna kesava Reddy Movie : 300 థియేటర్లలో ‘చెన్నకేశవరెడ్డి’: బసవ తారకం ఆసుపత్రి కోసం ఆ వసూళ్ళు.!

Chenna kesava Reddy Movie : పాత సినిమా మళ్ళీ విడుదల చేయడంలో ఆంతర్యమేంటి.? స్వామి కార్యం, స్వకార్యం.. రెండూనూ.! ఇదీ ఈ మధ్య నడుస్తోన్న ట్రెండ్. మొన్న ‘పోకిరి’, నిన్న ‘జల్సా’. ఇప్పుడేమో ‘చెన్నకేశవరెడ్డి’.!

అభిమానులు ఉర్రూతలూగేలా చేయడం ఈ స్పెషల్ రిలీజ్‌ల ఉద్దేశ్యం. అదే సమయంలో, అలా సినిమాల్ని ప్రత్యేకంగా విడుదల చేయడం వల్ల వచ్చే వసూళ్ళను సేవా కార్యక్రమాలకోసం వినియోగించడాన్ని అభినందించి తీరాల్సిందే.!

బాలయ్య మ్యాజిక్.!

Chenna kesava Reddy Movie Collected For Basava Tarakam Hospital

Chenna kesava Reddy Movie Collected For Basava Tarakam Hospital

‘చెన్నకేశవరెడ్డి’ సినిమా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో టబు, శ్రియ హీరోయిన్లుగా నటించారు. ‘సౌండ్ చేయకు.. కంఠం కోసేస్తా..’ అంటూ ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ అప్పట్లో ఓ సంచలనం.
కాగా, ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని దాదాపు 300 థియేటర్లలో ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. మొత్తం వసూళ్ళను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అందించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి తెలియనిదెవరికి.?

వందలాది మంది, వేలాది మంది.. లక్షలాది మంది క్యాన్సర్ బాధితులు ఆ ఆసుపత్రి కారణంగా కోలుకున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన ఈ ఆసుపత్రికి ప్రస్తుతం సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృస్ణ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.