Check : చెక్ సినిమా మీద రాజమౌళి స్టాంప్.. ఎంతవరకు నితిన్ కి ప్లస్ అవుతుందో..?

Check : చెక్ సినిమా మరికొన్ని రోజుల్లో భారీగా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 26 న థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేజర్స్ డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపంథ్యంలో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేందుకు బాగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర బృందం. ఈ గ్రాండ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మరొక గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.

check-rajamouli-stamp-on-check-movie-how-much-will-it-be-a-plus-for-nitin
check-rajamouli-stamp-on-check-movie-how-much-will-it-be-a-plus-for-nitin

ఈ సందర్భంగా చెక్ సినిమా సూపర్ హిట్ అవుతుందని రాజమౌళి నమ్మకంగా చెప్పుకొచ్చారు. గతంలో నితిన్ తన దర్శకత్వంలో సై అన్న సినిమా చేశాడని గుర్తు చేసుకున్న రాజమౌళి.. ఆ సినిమాని రగ్బీ ఆట నేపథ్యంలో రూపొందిస్తే చెక్ సినిమా చెక్ ఆట నేపథ్యంలో తెరకెక్కించారని …దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి చాలా టాలెంటెడ్ అని.. ఈ సినిమా అద్భుతంగా సక్సస్ ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ట్రైలర్ చూడగానే సినిమా చూసేయాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా చెక్ అని అభిప్రాయాన్ని తెలిపారు.

Check : చెక్ నితిన్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో..?

మొత్తానికి చెక్ సినిమా మీద రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి ఇంకాస్త బజ్ క్రియేటయ్యేలా చేశారు. చూడాలి మరి రాజమౌళి స్టాంప్ గట్టిగానే వేశారు. ఇది నితిన్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో. అలాగే వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలిపాడు. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఇక వచ్చే నెల 26 న రంగ్ దే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. నితిన్ కి జంటగా కీర్తి సురేష్ నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Advertisement