Chaysam : చైతూకి విషెస్ చెప్ప‌ని స‌మంత‌.. ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా అంటూ సెటైర్స్

Chaysam : అక్కినేని నాగ చైత‌న్య నిన్న త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా బంగార్రాజు టీజ‌ర్, థ్యాంక్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇక ప‌లువురు ప్ర‌ముఖులు, స‌న్నిహితులు చైతూకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే ఎవ‌రు విషెస్ చెప్పినా చెప్ప‌క‌పోయిన స‌మంత విషెస్ పైనే అంద‌రి దృష్టి ఉంది.

chaysam samantha no greet to chaitu on his birthday
chaysam samantha no greet to chaitu on his birthday

విడాకుల త‌ర్వాత చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్‌పై స‌మంత స్పందించిన విష‌యం తెలిసిందే. ట్విట్టర్‌ వేదికగా నాగచైతన్య చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన సమంత.. ‘ఈ సినిమా కచ్చితంగా విజయంతమవుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ క్యా్ప్షన్‌ జోడించారు. ఇందులో చైతూ పేరు మాత్రం మెన్ష‌న్ చేయ‌లేదు. దీంతో అప్పుడే అంద‌రిలో అనుమానాలు మొద‌ల‌య్యాయి.

chaysam samantha no greet to chaitu on his birthday
chaysam samantha no greet to chaitu on his birthday

భార్యాభర్తలుగా విడిపోతోన్నా కూడా తమ మధ్య ఉన్న స్నేహబంధం కొనసాగుతుందని సమంత, నాగ చైతన్యలు ఉమ్మడి ప్రకటన చేశారు. దాన్ని బట్టి కొన్ని విషయాలు అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటాయి. ఇకపై తాము కలిసి సంసార జీవితాన్ని కొనసాగించలేమని, కానీ ఫ్రెండ్స్‌లా ఉంటామని అన్నట్టు క్లారిటీగా చెప్పారు.

మ‌రి చైతూ బ‌ర్త్ డే రోజు స‌మంత త‌న మాజీ భ‌ర్త‌కు విషెస్ చెప్ప‌కుండా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇన్నాళ్లు అత‌నితో క‌లిసి ఉన్న సామ్‌కి విషెస్ కూడా చెప్పాల‌ని పించ‌లేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఈ ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

విడాకుల ఉమ్మడి ప్రకటనలో స్నేహితులుగా కొనసాగుతామని చెప్పారు. కానీ అదంతా ఈజీ కాదని అర్థమైనట్టుంది. అయితే నాగ చైతన్యతో కలిసి పని చేసిన రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ వంటి వారు నాగ చైతన్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. మరి ఈ లెక్కన ఇకపై నాగ చైతన్య, సమంత కలిసి సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉండదన్న మాట.

ఇన్ని రోజులు అవుతున్నా కూడా సమంత, నాగ చైతన్యల విడాకుల వెనుకున్న కారణాలు మాత్రం తెలియడం లేదు. ఆ ఇద్దరిలో ఎవ్వరూ కూడా నోరు విప్పి జరిగిన విషయం ఏంటో చెప్పడం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంత తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న రెండు ద్విభాష చిత్రాల్లో నటిస్తోంది.