Chay-Sam: పిల్ల‌ల విష‌యంలోనే చైతూ-సామ్ మ‌ధ్య అగ్గి రాజుకుందా?

Chay-Sam: నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల విష‌యం ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లోనే ఉంది. వారు విడిపోయి ఎంత ఫీల్ అవుతున్నారో తెలియ‌దు కాని, అభిమానులు మాత్రం ఇంకా దాని గురించి ముచ్చ‌టించుకున్నారు. ఎందుకు వారిరివురు విడిపోయారు అంటూ అనేక ర‌కాల ఆలోచ‌న‌లు చేస్తున్నారు.ఒక్కోక్క‌రు ఒక్కో కార‌ణం చెబుతుండ‌గా,ఇందులో ఏది నిజ‌మో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.

గత ఏడాది కరోనా సమయం నుండే సమంత, నాగ చైతన్య మధ్యలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. అప్పుడు వీళ్ల కెరీర్‌లో మాత్రమే కాదు.. అందరూ కెరీర్లో దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో పిల్లల కోసం ప్లాన్ చేయాలి అంటూ అక్కినేని కుటుంబం నుంచి సమంతకు ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది. కానీ దీనికి ఆమె నుంచి నో అనే స‌మాధానం వ‌చ్చింద‌ట‌.

పిల్ల‌ల‌ని క‌నే ఉద్దేశం త‌న‌కు లేద‌ని, అస‌లు పిల్ల‌ల‌ని క‌నాల‌ని త‌న‌పై ఒత్తిడి తీసుకురావొద్ద‌ని సమంత చెప్పిన‌ట్టు తెలుస్తుంది. బయట అక్కినేని కుటుంబానికి ఒక ఇమేజ్ ఉందని.. క‌చ్చితంగా పిల్లలు ఉండాల్సిందే అంటూ కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సమంత ససేమిరా అనడంతో.. ఇక్కడే మాట మాట పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

పిల్లల విషయంలో మొదలైన గొడవ తారాస్థాయికి చేరడంతో చివరికి విడాకుల వరకు వచ్చినట్లు స‌మాచారం.ఈ వివాదంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు చాలా మంది స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా కూడా ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుద‌ర‌క‌పోవ‌డంతో డైవ‌ర్స్ తీసుకున్నార‌ట‌. కరోనా సమయంలో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే.. ఆ రెండు సంవత్సరాల గ్యాప్‌లో కెరీర్‌పై కూడా ఎలాంటి ప్రభావం పడదు అంటూ.. సమంతకు నచ్చచెప్పడానికి అక్కినేని కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.