Vijay Devarakonda: విజ‌య్ మా కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు..ఛార్మి స‌ర్‌ప్రైజింగ్ కామెంట్స్

Vijay Devarakonda యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు ప‌లు సినిమాల‌కు సంబంధించిన ఈవెంట్స్ లో సంద‌డి చేస్తున్నాడు. తాజాగా ఆకాష్ పూరి, కేతిక శర్మలు జంటగా రాబోతోన్న రొమాంటిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజ‌రు అయ్యాడు.

TheNewsQube-

రొమాంటిక్ ప్రమోషన్స్ కోసం లైగర్‌ను కాస్త పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఈవెంట్లో ఛార్మీ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఓ విషయాన్ని చెప్పేసింది. అందులో విజయ్‌కి ఎలాంటి డిమాండ్లు ఉంటాయో చెప్పేసింది. సెట్ పక్కనే హోటల్ ఉండాలని అంటాడట. ‘విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడి ఇక్కడకి వచ్చాడు.

హైద్రాబాద్ నుంచి కారులో మూడు గంటలు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. అది ఎంత కష్టమో మాకు తెలుసు. అలా మూడు గంటలు రావాలి..మళ్లీ వెళ్లాలి. అది విజయ్‌కు ఎంత కష్టమో నాకు తెలుసు. మామూలుగానే విజయ్‌కి లాంగ్ జర్నీలు అంటే నచ్చవు.విజయ్‌కి సెట్ ఎక్కడ ఉంటుందో.. దాని పక్కనే హోటల్ ఉండాలి.. లేకపోతే ఉండలేడు. అలాంటి విజయ్ రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చాడు.

మా మీద ప్రేమ‌తో , వరంగల్ మీద, ఇక్కడి అభిమానుల మీదున్న ప్రేమతో ఆయ‌న వ‌చ్చాడు అని ఛార్మి చెప్పింది. సెట్ ప‌క్క‌నే హోట‌ల్ ఉండాలి, ఎక్కువ జ‌ర్నీ చేయ‌లేడ‌ని ఛార్మిఅన‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బ‌ద్ద‌కం అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకులు పూరి జగన్నాథ్‌, అనిల్‌ పాడూరి, నటి, నిర్మాత ఛార్మి, ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘లైగర్‌’ చిత్రం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.