Puri Jagannadh Birthday: పూరీ బ‌ర్త్ డే వేడుక‌లో ర‌చ్చ చేసిన ఛార్మి.. చేతిలో మందు గ్లాసుతో..

Puri Jagannadh Birthday: రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. షార్ట్ టైంలో అద్భుత‌మైన సినిమాలు చేసే పూరీ జ‌గ‌న్నాథ్ చివ‌రిగా ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న త‌దుప‌రి సినిమాల‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

బాలకృష్ణ‌, నాగార్జున స‌హా ఇప్ప‌టి త‌రంలోని అగ్ర హీరోలంద‌రూ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేసిన‌వారే. అలాంటి ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. అయితే ఆయ‌న‌తో క‌లిసి సినిమాల‌ను నిర్మిస్తోన్న ఛార్మి ముందుగా ఆయ‌నకు చెప్పిన బ‌ర్త్ డే విషెష్ వైరల్ అవుతుంది. అందుకు కార‌ణం, చేతిలో మందు గ్లాసుతో ఛార్మి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే అందుకు కార‌ణం.

‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఆ న‌మ్మ‌కాన్ని నేను ఎప్పుడూ నిల‌బెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు ప‌ట్టుకుని త‌న ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. పూరీ, ఛార్మీ క‌లిసి ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌ను నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమాకు ఆయ‌న‌తో పాటు ఛార్మి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ బద్రి’ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా రవితేజ-పూరీ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పాలి. ఇట్లు శ్రావణి సుబ్రణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తిరుగులేని విజయాలను అందుకోవడమే కాదు రవితేజను కెరీర్ స్పీడ్ పెంచాయి కూడా. సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన ‘పోకిరి’ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత ‘చిరుత,’ ‘దేశముదురు’ తో పూరీ మంచి సక్సెస్ అందుకున్నాడు. . ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’, ‘బిజినెస్ మేన్’, ‘ఇద్దరమ్మాయిలతో’ ,’ టెంపర్’, ‘ఇజం’.. ఇలా యంగ్ హీరోలందరితోనూ వరుస మూవీస్ తెరకెక్కించాడు పూరీ.