Acharya : ఆచార్యలో చరణ్ గెస్ట్ రోల్ కాదు..ఇది మెగా మల్టీస్టారర్.. కొరటాల క్లారిటీ.

Acharya : ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్. మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ – మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక జంటగా నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సంగీత, రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్స్‌లో కనిపిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముందు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. 40 కోట్ల రెమ్యునరేషన్ అని కూడా ప్రచారం జరిగింది.

charan is not playing a guest role..in acharya
charan is not playing a guest role..in acharya

అయితే కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారవడంతో బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశ్యంతో మహేష్ స్థానంలో చరణ్ వచ్చి చేరాడు. అంతేకాదు ఇందులో చరణ్ సిద్ద పాత్రలో కనిపిస్తుండగా ఆయన పాత్ర నిడివి కేవలం 20 నుంచి 25 నిముషాలు మాత్రమే ఉంటుందని చెప్పుకున్నారు. మధ్యలో కొన్ని రోజులు ఈ పాత్ర 40 నిముషాల వరకు ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ విషయంలో తాజాగా దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఇదే కాదు ఆచార్యకి సంబంధించి వస్తున్న కొన్ని రూమర్స్ మీద ఆయన స్పందించాడు.

Acharya : చిరు – చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారనే వార్తల్లోనూ నిజం లేదు.

ఆచార్య రిలీజ్ ఈ ఏడాదే ఉంటుందని తెలిపిన ఆయన చరణ్ పాత్ర కేవలం 25 నిముషాలు ఉంటుందనే వార్తల్లో నిజం లేదని వెల్లడించాడు. సెకాండాఫ్ మొత్తం చరణ్ పాత్ర ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు, అంతేకాదు చిరు – చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారనే వార్తల్లోనూ నిజం లేదని తేల్చి చెప్పారు. కేవలం 10 రోజుల టాకీపార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో చరణ్ – పూజాల మీద ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌తో కొరటాల సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపారు.