Shankar : శంకర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్..?

Shankar : శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రీసెంట్‌గా ఒక ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు – శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి రక రకాల వార్తలు వచ్చి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త వార్త వచ్చి హాట్ టాపిక్ అవుతోంది. శంకర్ తెరకెక్కించబోయో సినిమాలో రాం చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి.

charan dual role in shankar movie
charan dual role in shankar movie

శంకర్ సినిమాలలో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కెరీర్ లో ఎప్పుడు ఆ హీరో చేయని పాత్రలో శంకర్ చూపిస్తుంటాడు. ఒకే సినిమాలో హీరోని రెండు భిన్నమైన పాత్రలో చూపిస్తుండటం కూడా తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తాడని సంఘంలో కొందరు నాయకుల వల్ల ఎదురైన సవాళ్లతో ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తాడని సమాచారం అందుతోంది. ఒక రకంగా ఇదే కథా నేపథ్యం అనుకోవచ్చు. అంతేకాదు చరణ్‌ని ఏజ్డ్ పర్సన్ గా కూడా చూపించనున్నట్టు తెలుస్తోంది.

Shankar : శంకర్ చరణ్‌ని కూడా అదే తరహాలో రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించేందుకు ప్లాన్..!

శంకర్ గత చిత్రాలను గమనిస్తే రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ లాంటి స్టార్లను శంకర్ ఎంతో విలక్షణంగా చూపించాడు. అపరిచితుడులో విక్రమ్ ని రాము, రెమో, అపరిచితుడుగా చూపించాడు. రోబోలో రజనీకాంత్ ని సైంటిస్ట్‌గా చిట్టిగా చూపించాడు. అలాగే భారతీయుడు సినిమాలో కమల్ ని రెండు భిన్నమైన పాత్రల్లో చూపించాడు. ఇప్పుడు చరణ్‌ని కూడా అదే తరహాలో రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ పాన్ ఇండియన్ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement