Tollywood: విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిపై ఇంకా న‌మ్మ‌కం పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్

Tollywood: తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులున్నారు. కానీ విలక్షణ సినిమాలు చేయాలంటే కొందరు దర్శకులు మాత్రమే మనకు ఉన్నారు. అందులో చంద్రశేఖర్ ఏలేటి అందరికంటే ముందు ఉంటాడు. అప్పుడెప్పుడో 20 సంవత్సరాల కింద ఆయన తెరకెక్కించిన తొలి సినిమా ఐతే నుంచి నిన్న మొన్నటి చెక్ సినిమా వరకు తనదైన పంథాలో ముందుకు వెళ్తున్నాడు చంద్రశేఖర్ ఏలేటి.

Tollywood

చంద్ర‌శేఖ‌ర్ తీసిన సినిమాలు ఎంత వరకూ విజయం సాధించాయి అనేది పక్కన పెడితే ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుందనేది మాత్రం కాదనలేని నిజం. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఈ దర్శకుడిని నమ్మడానికి కొందరు నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేయడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి.

మొన్న నితిన్ హీరోగా తెరకెక్కించిన చెక్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. కానీ అత్యంత దారుణంగా ఈ సినిమా ముంచేసింది. ఈ సినిమా తర్వాత ఏలేటి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఈయన ట్రాక్ రికార్డు పక్కన పెట్టి టాలెంట్ మాత్రమే చూసి మైత్రి మూవీ మేకర్స్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Tollywood

సాహసం సినిమా స్టైల్లో సాగే ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ కథను వాళ్లకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కథ వాళ్లకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయాల్సిందిగా చంద్రశేఖర్ ఏలేటికి మైత్రి మూవీ మేకర్స్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ కథ పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఇందులో హీరో ఎవరు అనేది ఇప్పటి వరకు క్లారిటీగా లేదు. ఒకసారి కథ పూర్తయిన తర్వాత అన్ని వివరాలు బయటకు రానున్నాయి.