Chandra Babu Naidu : చంద్ర‌బాబుని న‌మ్మోద్దు, ఎన్టీఆర్‌ని చేసిన‌ట్టే… ల‌క్ష్మీ పార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chandra BAbu Naidu : ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న స‌తీమ‌ణిని వైసీపీ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. దీనిపై నంద‌మూరి ఫ్యామిలీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు దారుణంగా వైసీపీ తీరుని ఖండిస్తున్నారు.తననే గాక, తన కుటుంబంపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవమానించారంటూ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైన విషయం తెలిసిందే.

Chandra BAbu Naidu about lakshmi parvathy
Chandra BAbu Naidu about lakshmi parvathy

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు కన్నీరుపెట్టుకోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలకు గురయ్యాయి. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chandra BAbu Naidu about lakshmi parvathy 1
Chandra BAbu Naidu about lakshmi parvathy 1

అయితే వైసీపీ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు చంద్ర‌బాబు తీరుని ఖండిస్తున్నారు. శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తల్లి – చెల్లి, బాబాయ్‌ – గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్‌ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదన్నారు.

తాజాగా ఈ ఇష్యూపై ల‌క్ష్మీ పార్వ‌తి స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే.. అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు అబద్దాలు చెప్పారన్నారు. అక్కడ ఏమి జరగకపోయినా.. మసిపూసి మారేడుకాయ చేశారని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు గుప్పించారు. తాను వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు.

మరోసారి ఎన్టీఆర్ బాధల్ని కుటుంబానికి తెలియజేస్తానని వివరించారు. నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు మాయలో పడొద్దని కోరుతున్నా.. ఆ ఫ్యామిలీలో బాలయ్య బాబు మంచివాడని లక్ష్మీ పార్వతి తెలిపారు. మీరు కాదన్నా, ఔనన్నా తాను ఎన్టీఆర్ అర్ధాంగిని అని అన్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని ఓ నిజం చెబుతున్నా.. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి.. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని అన్నారు. ఇది నిజమో కాదో బాలయ్య.. చంద్రబాబును అడగాలని లక్ష్మీపార్వతి చెప్పారు.